ఈసి అధికారులను చితగ్గొట్టిన దీదీ పార్టీ వర్కర్స్

తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తల తీరుపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ముందు వీడియో ఫుటేజ్‌ని పరిశీలించాలని డిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించుకున్నారు.
గురువారం సాయంత్రంలోగా సంఘటనపై నివేదిక సమర్పించాలని ఈసి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు కోల్‌కతాలో ఈసి డైరెక్టర్ ధీరేంద్ర ఓఝా చెప్పారు. బైక్ ర్యాలీని నలుగురు అధికారులు వీడియో తీయడానికి పూనుకున్నారు. ఈ సమయంలో టిఎంసి కార్యకర్తలు వారిలో ఇద్దరిని కొట్టారు.
బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి సంఘటనపై విచారణ జరుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా హింస పెచ్చరిల్లే ప్రమాదం ఉందని ఇటీవలి ఈసి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.












Click it and Unblock the Notifications