అనుచిత వ్యాఖ్యలపై ఈసీ నజర్ : మోదీ, షా, రాహుల్‌పై చర్యలు ?
న్యూఢిల్లీ : ఎన్నికల వేళ అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇటీవల కాంట్రవర్సీ కామెంట్లు చేసిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం ఈసీ నిర్ణయం తీసుకోనుంది.

పదే పదే ప్రచారం
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా .. పాక్ లోని బాలకోట్ లో గల ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామని, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తోందని కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజే వీరిపై నిర్ణయం తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.
ఏకపక్షం
మోదీ, షా ప్రకటనలు వివక్షపూరితంగా ఏకపక్షంగా ఉన్నాయని, ఇది భారతదేశ ఎన్నికల సమగ్రతను దెబ్బతీసేలా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు కాంగ్రెస్ నేత సుష్మితదేవ్. ఇదివరకు ఈసీకి కూడా మోదీ వైఖరిపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు మోదీ ప్రచారంపై 48 నుంచి 72 గంటలపాటు నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. గత నాలుగువారాల నుంచి మోదీ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని, దీనిపై 10 సార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications