ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆయన నివాసంలోనే విచారించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.
అంతకుముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఫోన్‌ను సీజ్ చేశారు. తొలుత దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన తర్వాత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేజ్రీవాల్‌ను దాదాపు రెండు గంటలపాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. తాజా పరిణామాలతో సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఆప్ కార్యకర్తలు, నేతలు చేరుకుని కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

కాగా, లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ హాజరయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఇప్పటికిప్పుడు ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
#WATCH | AAP MLA Rakhi Birla detained by Delhi Police while protesting outside the residence of Delhi CM Arvind Kejriwal.
— ANI (@ANI) March 21, 2024
Delhi CM and AAP national convenor Arvind Kejriwal was arrested by the Enforcement Directorate (ED) in the Excise policy case. pic.twitter.com/j8NEawWk8v
జైలు నుంచే కేజ్రీవాల్ పాలన: ఆప్ నేతలు
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ.. ఆయనే సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ పెద్ద కుట్రేనని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు.
#WATCH | AAP leader Atishi says, "We have received news that ED has arrested Arvind Kejriwal... We have always said that Arvind Kejriwal will run the govt from jail. He will remain the CM of Delhi. We have filed a case in the Supreme Court. Our lawyers are reaching SC. We will… pic.twitter.com/XWQJ1D6ziR
— ANI (@ANI) March 21, 2024
సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
తాజా పరిణామాల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర ఉపవమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపేందుకు లీగల్ టీం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ పిటిషన్ పై శుక్రవారం ఉదయం వరకు విచారణ చేపట్టే అవకాశం లేదని తెలుస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications