ఈ మూడు సంస్థల ఆఫీసులపై ఈడీ దాడులు.. చైనా వ్యక్తులేనంటూ..
లోన్ కోసం ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు తగ్గడం లేదు. పోలీసులు ఎంత చెబుతోన్న కొందరు వారి వలలో పడుతున్నారు. ఈ క్రమంలో ఐటీ హబ్ బెంగళూరులో గల కొన్ని లోన్ యాప్ కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద శుక్రవారం నుంచే రైడ్స్ జరుగుతున్నాయి.
బెంగళూరులో గల రోజర్ పే, పేటీఎమ్, క్యాష్ ఫ్రీ ఆన్ లైన్ యాప్ కేంద్రాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 18 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజలను వేధింపులకు సంబంధించి, ఆన్ లైన్ యాప్ వేధింపులపై కేసులు ఫైల్ చేశారు. చైనీస్ సంస్థలు వీటిని ఆపరేట్ చేస్తున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు.

చైనా వ్యక్తుల నియంత్రణలో ఉన్న సంస్థల ఐడీ, బ్యాంక్ ఖాతాలో రూ.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలను ఉపయోగించారనే విషయం తెలిసింది. డమ్మ డైరెక్టర్లుగా మార్చారని కూడా అభియోగం మోపింది.
వారు తమ అక్రమ లావాదేవీలను బ్యాంకుల ద్వారా చేస్తున్నాయని గుర్తించారు. రోజర్ పే ప్రైవేట్ లిమిటెడ్, క్యాష్ ఫ్రీ పేమెంట్స్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్.. ఈ మూడింటిని చైనా వ్యక్తులు ఆపరేట్ చేస్తున్నారని ఈడీ అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications