విలాసపురుషుడికి పెద్ద షాక్! ఆస్తుల స్వాధీనానికి చర్యలు చేపట్టిన ఈడీ!
పదిహేడు బ్యాంకులను ముంచి రూ.9 వేల కోట్ల అప్పులతో పరారైన బిజెనెస్ టైకూన్ విజయ్‌మాల్యాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన ఆస్తుల స్వాధీనం వేగవంతం చే
న్యూఢిల్లీ: పదిహేడు బ్యాంకులను ముంచి రూ.9 వేల కోట్ల అప్పులతో పరారైన బిజెనెస్ టైకూన్ విజయ్‌మాల్యాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన ఆస్తుల స్వాధీనం వేగవంతం చేసింది.
ముందుగా మాల్యాకు అత్యధిక పట్టున్న యునైటెడ్ బ్రూవరీస్‌పైనే దృష్టిపెట్టింది. ఈ కంపెనీలో మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువైన వాటాలను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయనుంది.

రెండునెలల క్రితమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈ మేరకు ఓ లేఖను ఎస్‌హెచ్‌సీఐఎల్‌కు పంపించింది. దీని ప్రకారం తాకట్టులోని లేని యబీఎల్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, మెక్‌డోవెల్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లలోని మాల్యా షేర్లను కేంద్రానికి బదిలీ చేయాల్సిందిగా కోరింది.
ఈ కంపెనీల్లో మాల్యాకు రూ.4,000 కోట్ల విలువైన షేర్లు ఉంటాయని అంచనా.
ఈడీ ఇప్పటికే యూబీఎల్‌కు చెందిన 4 కోట్ల వాటాలు, యూఎస్‌ఎల్‌కు చెందిన 25.1 లక్షల వాటాలు, మెక్‌డోవెల్స్ హోల్డింగ్స్‌లోని 22 లక్షల వాటాలను అటాచ్ చేసింది.
వీటితోపాటు విజయ్ మాల్యావిగా అనుమానిస్తున్న మరికొన్ని కంపెనీలపై కూడా ఈడీ దృష్టి సారించింది. వీటిల్లో దేవీ ఇన్వెస్ట్‌మెంట్స్, కింగ్‌ఫిషర్ ఫిన్‌వెస్ట్ ఇండియా, మాల్యా ప్రైవేటు లిమిటెడ్, ఫార్మాట్రేడింగ్ కంపెనీ, విట్టల్ ఇన్వెస్ట్‌మెంట్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్, కామ్‌స్కో ఇండస్ట్రీస్, 'ది గెమ్' ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీలపై కూడా దృష్టిపెట్టింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చనిపోయిన సందర్భంలో గానీ, నేరస్తుడిగా గుర్తించిన సందర్భంలో గానీ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో నిందితుడి ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీచేయవచ్చు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications