వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్: జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సోనియా గాంధీలను విచారిస్తున్న ఈడీ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నడుమ శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.

ముంబయిలోని చాల్ రీడెవలప్‌మెంట్‌కు సంబంధించి అక్రమ నగదు చెలామణీ కేసులో సంజయ్‌కు ఈడీ ఈ సమన్లు జారీచేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో సంజయ్ రౌత్‌ భార్య వర్ష రౌత్, సంజయ్ ఇద్దరు సన్నిహితులకు చెందిన రూ.11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.

ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన 37 మంది శివసేన ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో తిరుగుబాటు లేవనెత్తిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ప్రమాదంలో పడింది. ప్రస్తుతం ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు అస్సాంలోని గువాహటిలో మకాం వేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఈ నేపథ్యంలో ఈడీ సమన్లపై ట్విటర్ వేదికగా సంజయ్ రౌత్ స్పందించారు. ''మహారాష్ట్రలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన సైనికులు యుద్ధమే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నాపై కుట్ర పన్నుతున్నారు. నా తల నరికినా నేను గువాహటి మార్గంలోకి వెళ్లను’’అని ఆయన వ్యాఖ్యానించారు.

https://twitter.com/rautsanjay61/status/1541329078849900545

మరోవైపు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను కూడా అక్రమ నగదు చెలామణీ కేసులో ఈడీ సోమవారం ప్రశ్నించింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదుచేసింది.

సుకేశ్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించి జాక్వెలిన్‌కు ఈడీ ఈ సమన్లు జారీచేసింది. ఇప్పటికే రూ.7.27 కోట్ల విలువైన జాక్వెలిన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీచేసింది. రాహుల్ గాంధీని కూడా వరుసగా రోజులపాటు ఈడీ ప్రశ్నించింది.

ఈ వార్తల నడుమ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై చాలా ప్రశ్నలు వార్తల్లో నిలుస్తున్నాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు మీ కోసం..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఎప్పుడు ఏర్పాటుచేశారు?


ఆర్థిక పరమైన నేరాలు, విదేశీ మారకపు నిల్వల చట్టాల ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్‌ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్‌గా 01, మే 1956లో దీన్ని ఏర్పాటుచేశారు.

1957లో దీని పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌గా మార్చారు. ఇది భారత ప్రభుత్వ ఆర్థిక నిఘా విభాగంగా పనిచేస్తోంది.


ఏ విభాగం కింద ఈడీ పనిచేస్తుంది?


మొదట్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ కింద ఈడీ ఉండేది. అయితే, 1960ల్లో దీన్ని ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగం పరిధిలోకి తీసుకొచ్చారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఈడీ ప్రధాన కార్యాలయం, ఇతర కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి?


ఈడీ ప్రధాన కార్యాలయం దిల్లీలో ఉంది. డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈడీకి అధిపతిగా కొనసాగుతున్నారు.

మరోవైపు ముంబయి, చెన్నై, కోల్‌కతా, చండీగఢ్‌లలోనూ ఈడీ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతీయ కార్యాలయాలకు స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నేతృత్వం వహిస్తున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లోని జోనల్, సబ్ జోనల్ కార్యాలయాల విధులను స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు చూసుకుంటారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

ఏ చట్టాల కింద ఈడీ పనిచేస్తుంది?


ఐదు చట్టాల కింద ఈడీ పనిచేస్తుంది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002 (పీఎంఎల్ఏ): అక్రమ నగదు చెలామణీ కింద సంపాదించిన ఆస్తులను జప్తు చేయడానికి, కేసుల దర్యాప్తుకు ఈ క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చారు.

అక్రమ నగదు చెలామణీ కేసులను ఈ చట్టం కిందే ఈడీ విచారిస్తుంది. ఆస్తుల జప్తు కూడా ఈ చట్టం కిందే జరుగుతుంది.

ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999 (ఎఫ్ఈఎంఏ): విదేశీ వాణిజ్యంతోపాటు విదేశీ చెల్లింపుల్లో అవకతవకలపై విచారణ చేపట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కేసుల్లో అవకతవకలు పాల్పడిన మొత్తానికి మూడు రెట్లు వరకు జరిమానా విధించే అవకాశముంది.

ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్, 2018 (ఎఫ్ఈఓఏ): భారత్‌ను వదిలిపెట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరస్థులపై విచారణ చేపట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, 1973: విదేశీ కరెన్సీలకు సంబంధించిన చెల్లింపులకు సంబంధించిన నేరాలను ఈ చట్టం కింద విచారణ చేపడతారు.

ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ ప్రొటెక్షన్ అండ్ స్మగ్లింగ్ యాక్ట్ 1974: ఈ చట్టం కింద ముందస్తు అరెస్టులు చేయడానికి ఈడీ అధికారం దాఖలుపడింది.


ఈడీ అధికారాలు ఏమిటి?


నల్ల ధనం కేసుల్లో నిందితులను అరెస్టు, దర్యాప్తు చేసు అధికారాలు ఈడీకి ఉన్నాయి. నిందితుల ఆస్తులను కూడా ఈడీ జప్తు చేస్తుంది.

ఏదైనా కేసు విలువ ఒక కోటి రూపాయలు దాటితే ఈడీ పరిధిలోకి వస్తుంది.

అక్రమ నగదు చెలామణీ కేసుల్లోనూ సోదాలు, జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది.


ఈడీకి ప్రత్యేక కోర్టులు ఉన్నాయా?


ప్రివెన్సన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సదరు రాష్ట్రం ప్రధాన న్యాయమూర్తులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా ఏర్పాటుచేయొచ్చు.

ఈ చట్టం కింద ఏర్పాటుచేసే కోర్టులను పీఎంఎల్ఏ కోర్టులుగా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
ED which is investigating Sonia Gandhi and Jacqueline falls under which department
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X