"300కోడిగుడ్ల వంటకు.. 19లక్షలు": యూట్యూబ్ లో వైరల్ వీడియో
హైదరాబాద్ : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. సెన్సేషన్ కోసం తాపత్రయపడేవాళ్లందరికీ ఓ వేదిక దొరికనట్టయింది. టాలెంట్ ఏదైనా ఓ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేస్తే సరి.. ప్రపంచం ముందు మీ టాలెంట్ ను ప్రదర్శించినట్టే. పైగా.. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉండడంతో.. ఇప్పుడిలాంటి వీడియోలు యూట్యూబ్ లో కోకొల్లలు.

సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన కొన్ని సంస్థలు.. యూట్యూబ్ వీడియోలనే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. అదే క్రమంలో విలేజ్ ఫ్యాక్టరీ అనే ఓ సంస్థ గ్రామీణ వంటకాలను యూట్యూబ్ ద్వారా నెటిజెన్స్ కు పరిచయం చేస్తోంది. అందులో భాగంగానే.. 300గుడ్లతో తయారు చేసిన 'ఎగ్ కర్రీ'ని నవంబరు 3న యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది.
ఈ వీడియో జనాలను ఎంతగా ఆకర్షించిందంటే.. ఇప్పటిదాకా 19లక్షల పైచిలుకు మంది ఈ వీడియోను చూశారు. చూసినవాళ్లంతా మేమూ ట్రై చేస్తామంటూ.. సదరు వంటాయనను అభినందిస్తున్నారు. మొత్తానికి ఒక్క వీడియోతో ఆ వంటాయన కూడా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు.












Click it and Unblock the Notifications