వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్

|
Google Oneindia TeluguNews

ఎన్నికలు సజావుగా జరగటం కోసం ,గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈసారి జరగనున్న ఎన్నికల్లో రిజర్వుడ్ ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్ లను తరలించే వాహనాలకు జిపిఎస్ ను అమర్చి మరీ పర్యవేక్షించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరగడం కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను, భద్రతా చర్యలుతేసుకుఎ క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ.

 ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధం ఎలక్షన్ కమీషన్ కీలక నిర్ణయం .. జంతువులతో ప్రచారం నిషేధం

గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్ లు రోడ్లమీద, ఓ ఎమ్మెల్యే ఇంట్లో, హోటళ్లలో ఎక్కడపడితే అక్కడ దొరికిన నేపథ్యంలో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని రాష్ట్రాలకు ఓటింగ్ యంత్రాలను నిర్దేశించిన గమ్యానికి చేర్చేవరకు చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాలంటూ అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశించింది.

బాధ్యతా రాహిత్యం ... సి విజిల్ ని కూడా సిల్లీగా వాడేస్తున్నారా ? బాధ్యతా రాహిత్యం ... సి విజిల్ ని కూడా సిల్లీగా వాడేస్తున్నారా ?

 Election Commisions key decision..Vehicles transporting reserve EVMs, VVPATs to have GPS trackers

గతంలో చాలా సందర్భాల్లో ఈవీఎంలు మాయమైనా, పోలింగ్ అధికారులు శ్రద్ధ చూపకుండా చాలా నిర్లక్ష్యంగా వహించారని, అవసరమైన చర్యలు చేపట్టలేదని ఈసీ గుర్తించింది. అలాంటి నిర్లక్ష్యానికి చెక్ పెట్టటానికి అధికారులకు చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ జీపీఎస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం ఈ సారి ఎన్నికల్లో దాదాపు 39.6 లక్షల ఈవిఎంలను, 17.4 లక్షల వీవీ ప్యాట్ లు ఉపయోగించనున్నారు. ఎన్నికలు సజావుగా జరగడం కోసం, గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

English summary
The Central Election Commission has made a sensational decision on the forthcoming general elections. The Election Commission of India (ECI) has directed officials to use vehicles installed with GPS trackers and mobile-based tracking system for transportation of reserve EVMs and VVPATs, an official said.The poll panel has instructed that end-to-end movement of all reserve EVMs and VVPATs shall be carefully monitored at all times, for which vehicles of sector officers, with reserve EVMs and VVPATs, shall be fitted with GPS tracking system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X