యూపీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయమిదే-తేల్చిచెప్పిన ఈసీ
కోవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల కారణంగా కరోనా కేసులు ఇంకా పెరగవచ్చని భావిస్తున్న తరుణంలో ఎన్నికల్ని వాయిదా వేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఎన్నికల సంఘంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు కోవిడ్ కేసులు అఢ్డంకి కాదని బావిస్తున్న రాజకీయ పార్టీలు ఎన్నికల్ని సకాలంలోనే నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. యూపీలో రాజకీయ పార్టీలు ఎన్నికలు సకాలంలోనే జరగాలని కోరుతున్నాయని, కోవిడ్ కేసుల నేపథ్యంలో ఆంక్షల మధ్య ఎన్నికల నిర్వహణ చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమయానికి నిర్వహించాలని చెప్పాయి, దేశవ్యాప్తంగా కొత్త అంటువ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే దానిపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టతనిస్తూ ఎన్నికల సంఘం ఇవాళ ఈ ప్రకటన చేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఇవాళ మీడియాతో మాట్లాడుతూ అధికార బీజేపీ, ప్రధాన ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పాయని వెల్లడించారు. జనాభాలో హాని కలిగించే సమూహాలను సంక్రమణ ముప్పు నుండి ఎలా రక్షించవచ్చనే దానిపై పార్టీలు అనేక సూచనలతో ముందుకు వచ్చాయన్నారు. కొత్త ఒమిక్రాన్ స్ట్రెయిన్ కారణంగా కేసుల పెరుగుదల మధ్య ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు చేసిన అభ్యర్థన మేరకు సుశీల్ చంద్ర నేతృత్వంలోని ఎన్నికల కమిషన్ బృందం ఇవాళ యూపీలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications