ఎన్నికలొస్తే పద్మరాజన్ కు పండుగే.. రికార్డు స్థాయిలో పోటీ.. ఒక్కసారైనా గెలిచాడా?
చెన్నై : ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆషామాషీ కాదు. నామినేషన్ మొదలు ప్రచార సామాగ్రి, ఎన్నికల ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఒక్కసారి పోటీ చేసి ఓడిపోతే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంటుంది. అలాంటిది ఓ పెద్దాయన 200వ సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంతకు ఆయన కోటీశ్వరుడు కాదు.. సాదాసీదా మనిషే. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది కదా. ఎన్నికల్లో పోటీచేయడం ఆయన ఈస్టైల్ అన్నమాట.

62 ఏళ్ల ప్రాయంలో మరోసారి..
గెలుపోటములు ఆయనకు లెక్క లేదు. ఎన్నికలు వచ్చాయా, పోటీ చేశామా అన్నదే ఆయన పాయింట్. తమిళనాడులోని సేలం జిల్లా కుంజాండియార్ ప్రాంతానికి చెందిన కె. పద్మరాజన్ స్థానికంగా టైర్ల వ్యాపారం చేస్తుంటారు. తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు లభించాలన్నది ఆయన అంతరంగం. అందుకే ఎన్నికలను టార్గెట్ గా చేసుకున్నారు. ఎలక్షన్లు వస్తే చాలు పోటీచేయడం పనిగా పెట్టుకున్నారు. 62 ఏళ్ల వయసున్న పద్మరాజన్ ఇప్పటికే 199 సార్లు ఎన్నికల బరిలోకి దిగారట. ఈసారి పోటీచేసి 200వ రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నారట.

ఓడిపోవుడే.. అయినా మళ్లీ ప్రయత్నం
ఎలక్షన్లు రావడం, నామినేషన్ వేయడం, పోటీ చేయడం, ఓడిపోవడం.. ఇదంతా ఆయనకు కామన్ గా మారింది. ఇన్నిసార్లు పోటీచేసినా.. గెలుపైతే దక్కలేదు గానీ దేశవ్యాప్తంగా గుర్తింపు మాత్రం లభించింది. 1986 నుంచి మొదలైన పద్మరాజన్ పోటీ ప్రస్థానం అలా అలా కొనసాగుతూ వస్తోంది. పోటీచేసిన ప్రతిసారి ఓడిపోవడం, డిపాజిట్ దక్కకపోవడం లాంటి విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోరు.
2011లో తమిళనాడులోని మెట్టూరు అసెంబ్లీ స్థానానికి పోటీచేయగా అత్యధికంగా 6వేల పైచిలుకు ఓట్లు పోల్ కావడం విశేషం.
ఒక తమిళనాడే కాదు ఏపీ, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ పద్మరాజన్ పోటీ చేసిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా ఎక్కడో ఒక చోట నుంచి పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

మహామహుల మీద పోటీ
1991లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పోటీచేసినప్పుడు అక్కడినుంచి పద్మరాజన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆయనను కిడ్నాప్ చేయడంతో బాగా పాపులర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో సెగ్మెంట్ నుంచి అటల్ బీహార్ వాజపేయిపై కూడా పద్మరాజన్ పోటీ చేశారు. 2014లో నరేంద్ర మోడీపై పోటీ చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సరైన వివరాలు పొందుపరచలేదనే కారణంతో పద్మరాజన్ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.
నలుగురు ప్రధానులు, 11 మంది ముఖ్యమంత్రులపై పోటీ చేసిన రికార్డు పద్మరాజన్ సొంతం. ఎక్కువసార్లు పోటీ చేయడం, అపజయాలు పొందడం ఆయనకు రికార్డులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే లిమ్కాబుక్ రికార్డ్స్ లోకి ఎక్కేశారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications