చెక్ పోస్టు దగ్గరే చెడిపోయిన ఆటో, రెండు బ్యాగుల్లో ఎన్నికోట్ల క్యాష్ అంటే ?, టైమ్ బ్యాడ్ !

బెంగళూరు/జయనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీన జరగనున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోనిన 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టిన ఎన్నికల అధికారులు అనుమానం వచ్చిన ప్రతి వాహనం పరిశీలించి పంపిస్తున్నారు.

టైమ్ బ్యాడ్ ఏమో తెలీదు. బెంగళూరులో సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ చెక్ పోస్టు దగ్గర వేగంగా వెలుతున్న ఆటో చెడిపోయి ఒక్కసారిగా నిలిచిపోయింది. కేవలం 50 మీటర్ల దూరంలో చెక్ పోస్టు ఉంది. రోడ్డు పక్కనే ఆటో నిలిపిన డ్రైవర్ ఆటో రిపేర్ చెయ్యడనికి ప్రయత్నించాడు. పోలీసులు ఆటో దగ్గరకు వెళ్లడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

బెంగళూరు నగరంలోని ఎస్ జే పార్క్ ఏరియాలోని కలింగరావ్ బస్ స్టాప్ సమీపంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి జయగనర్ నుంచి విజయ్ నగర్ కు ఓ ఆటో బయలుదేరింది. ఆటోలో సురేష్, ప్రవీణ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వేగంగా వెలుతున్న ఆటో కలింగరావ్ బస్ స్టాప్ సమీపంలో ఒక్కసారిగా నిలిచిపోయింది.

500notesbundle

రోడ్డు పక్కన ఆటో నిలిపిన ప్రవీణ్, సురేష్ ఆటో రిపేర్ చెయ్యడానికి ప్రయత్నించారు. చెక్ పోస్టు దగ్గర ఉన్న పోలీసులు, ఎన్నికల అధికారులకు ఆటో దగ్గరకు వెళ్లి ఏం జరిగింది అని ప్రశ్నించారు. ఆ సందర్బంలో ఆటో డ్రైవర్ పొంతనలేని సమాధానం చెప్పాడు. ఆటోలో చూస్తే రెండు పెద్ద బ్యాగ్ లు దర్శనం ఇచ్చాయి. బ్యాగ్ ల్లో ఏమి ఉన్నాయని పోలీసులు ప్రశ్నిస్తే బట్టలు అని ఇద్దరూ చెప్పారు.

పోలీసులకు అనుమానం వచ్చి రెండు బ్యాగ్ ల జిప్ లు తీసి చూస్తే వారి మైండ్ బ్లాక్ అయ్యింది. రెండు బ్యాగ్ ల్లో రూ. 500 నోట్ల కట్టలు దర్శనం ఇచ్చాయి. డబ్బు లెక్క పెట్టగా అక్షరాలా కోటి రూపాయలు ఉంది. డబ్బులు ఎక్కడిది ?, ఎక్కడికి తీసుకెలుతున్నారు అని అధికారులు ప్రశ్నిస్తే ప్రవీణ్, సురేష్ పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆ డబ్బును అధికారులు సీజ్ చేశారు. ప్రవీణ్, సురేష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు ఎన్నికల అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+