సిన్సియర్ ఆఫీసర్స్, పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు వదిలేసి వెళ్లిపోయి, క్లైమాక్స్ ?
బెంగళూరు/చిక్కమగళూరు: కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎన్నికల సిబ్బందికి ఈవీఎం యంత్రాలు ఇచ్చిన ఎన్నికల అధికారులు పోలింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎం యంత్రాలను జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే బాధ్యతను ఎన్నికల సిబ్బంది, పోలీసులకు అప్పగించారు.
అయితే ఓ సిన్సియర్ ఆఫీసర్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎం యాత్రాలను అక్కడే గాలికి వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో శాంతియుతంగా పోలింగ్ జరగడానికి ఎన్నికల అధికారులు, పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

మూడునాలుగు చోట్ల మినహా కర్ణాటకలో ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం ఆరు గంటల తరువాత పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సిబ్బంది ఈవీఎం యంత్రాలు ఎత్తుకుని పోలీసుల భద్రతతో కేఎస్ఆర్ టీసీ బస్సుల్లో ఎన్నికల అధికారులు సూచించిన స్ట్రాంగ్ రూమ్ ల దగ్గరకు వెళ్లి ఆ యంత్రాలను అక్కడే భద్రపరిచారు.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ల్లో నుంచి ఈవీఎంలు అన్ని స్ట్రాంగ్ రూమ్ లకు చేరిపోయి ఉంటాయని బుధవారం రాత్రి ఎన్నికల అధికారులు అనుకున్నారు. అయితే ఎన్నిల విధుల్లో పాల్గొన్న సిన్సియర్ అధికారులు చిక్కమగళూరు నగరంలోని పెన్షన్ మొహల్లాలోని బూత్ నెంబర్ 168లో ఈవీఎం యంత్రాలు వదిలేసి వెళ్లిపోయారు.

పోలింగ్ పూర్తి అయిన తరువాత ఓ పార్టీకి చెందిన ఏజెంట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగా అక్కడ ఈవీఎం యంత్రాలు కనపడటంతో షాక్ అయిన పార్టీ ఏజెంట్ వెంటనే ఎన్నికల అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎన్నికల అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈవీఎం యంత్రాలు స్వాధీనం చేసుకుని స్ట్రాంగ్ రూమ్ కు తీసుకెళ్లారు.
చిక్కమగళూరు నగరంలోని పెన్షన్ మొహల్లా పోలింగ్ బూత్ చాలా సున్నితమైన ఏరియా కావడంతో ఎక్కువ సంఖ్యలోనే పోలీసులను నియమించారు. అయినా అక్కడ పోలీంగ్ విధులు నిర్వహించిన సిబ్బంది నిర్లక్షంగా విధులు నిర్వహించారని పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు. ఉదయం నుంచి భారీగా పెన్షన్ మొహల్లాలోని 168 పోలింగ్ బూత్ లో ఈవీఎం యంత్రాలు వదిలేసి వెళ్లిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications