వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: ఉధృతంగా గంగా నది.. సాహసం చేసిన ఏనుగు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

|
Google Oneindia TeluguNews

భారీ వర్షాల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమై దైనందిన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వరదల్లో ఓ ఏనుగు చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా నదిని ఈదడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

ఏనుగు నదిని దాటుతున్నప్పుడు దానిపై మావటి కూర్చున్నాడు. చివరికి ఏనుగు, దానిపై కూర్చున్న వ్యక్తి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే భయంకరంగా ప్రవహిస్తున్న నదిలో ఏనుగు దాటడం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. "వైశాలి జిల్లాలోని రాఘోపూర్‌లో ఏనుగు, ఓ వ్యక్తి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా నదిని 3 కిలోమీటర్లు ధైర్యంగా ఈదారు." అని పోస్ట్ లో రాశారు.

Elephant crosses Ganga river at dangerous Situaion in bihar video goes viral

భయానక వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో నెటిజన్లు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ప్రవాహంలో 3 కిలోమీటర్లు దాటడం గొప్ప విషయమని ఒకరు.. ఏనుగు ధైర్యానికి ఫిదా అయిపోయమని కొందరు కామెంట్ చేశారు. ఏదిఏమైనా ఏనుగు గంగా నదిని దాటడం ఆశ్చర్యకరమైన విషయమే..

English summary
Dangerous video viral in social media. Elephant crosses Ganga river at dangerous Situaion in that vidoe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X