వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకొండి,ఈసీఆదేశం

పదే పదే ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించినందుకుగాను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ గోవా ఎన్నికల అధికారులను ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన రోజునుండే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది.

అయితే ఎన్నికల నియామవళిని అమలు చేయాలని ఈసీ ఆదేశించింది.అయితే రాజకీయపార్టీ నాయకులు ఎన్నికల నియామవళిని పదే పదే ఉల్లంఘిస్తున్నారు.

ఆప్ కన్వీనర్ , న్యూఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్నికల నియావళిని ఉల్లంఘించినందుకు ఈసీ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

 అరవింద్ కేజ్రీవాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొండి

అరవింద్ కేజ్రీవాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొండి

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉల్లంఘిస్తున్నారని ఈసీ అభిప్రాయపడింది. ఈసీ హెచ్చరికలను ఖాతరు చేయడం లేదని ఈసీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కేజ్రీవాల్ పై ఈసీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ గోవా రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది.

 ఈసీకి ఎందుకు కోపం వచ్చిందంటే

ఈసీకి ఎందుకు కోపం వచ్చిందంటే

గోవాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆప్ కన్వీనర్ , న్యూ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ప్రత్యర్థిపార్టీలు డబ్బులిస్తే తీసుకొండి, కాని, ఆప్ కే ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు. అయితే ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు.పై ఈ నెల 19వ, తేదిలోపుగా వివరణ ఇవ్వాల్సి ఉండగా , వివరణ ఇవ్వకుండానే కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు.ఈసీ ని అరవింద్ తప్పుబట్టారు.

అరవింద్ ను హెచ్చరించిన ఈసీ

అరవింద్ ను హెచ్చరించిన ఈసీ

ఈ నెల 19వ, తేదిలోపుగా ఈసీ కి వివరణ ఇవ్వాల్సి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇవ్వకపోగా, కోర్టును ఆశ్రయించాడు.దీంతో జనవరి 21న, ఈసీ అరవింద్ ను హెచ్చరించింది. ఎన్నికల ప్రవర్తనా నియామావళిని పదే పదే ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది.ఈ హెచ్చరికలను అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదు.

 గోవా అధికారులకు ఈసీ ఆదేశాలు

గోవా అధికారులకు ఈసీ ఆదేశాలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవాలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఈ విషయమై ఈసీ వివరణ కోరితే తనపై ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు తప్పంటూ ఈసీవ్యవహరశైలిని అరవింద్ దుయ్యబట్టారు. కింది కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఈసీ ఈ ఉత్తర్వును పట్టించుకోలేదన్నారు.ఈ విషయమై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ పదేపదే ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించింనందుకుగాను చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గోవా ఎన్నికల అధికారులను ఆదేశించింది.

English summary
eletion commission ordered legal action against on aravind kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X