స్టాన్ స్వామిది వ్యవస్ధాగత హత్యే-తలోజా జైల్లో తోటి ఖైదీల నిరాహారదీక్ష
మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడిగా ఉంటూ తాజాగా మృతిచెందిన స్టాన్ స్వామి వ్యవహారం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఆయన ప్రభుత్వ వేధింపుల వల్లే చనిపోయారంటూ దేశ విదేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతుండగా... ఇప్పుడు ఆయనతో పాటు సహనిందితులుగా ఉన్న వారు తలోజా జైల్లో నిరసనలకు దిగుతున్నారు.
ఎల్గార్ పరిషద్ కేసులో స్టాన్ స్వామితో పాటు అరెస్ట్ అయి తలోజా జైల్లో ఉన్న పది మంది సహనిందితులు ఇవాళ ఒక్క రోజు నిరాహార దీక్ష పాటిస్తున్నారు. స్టాన్ స్వామిది ప్రభుత్వం చేసిన వ్యవస్దాగత హత్య అంటూ వారు ఆరోపిస్తున్నారు. స్టాన్ స్వామిని వేదింపులకు గురి చేయడం ద్వారా ప్రభుత్వమే ఆయన ప్రాణాలు హరించిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏతో పాటు తలోజా జైలు మాజీ సూపరిండెంట్ పై దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు.

2017 నాటి ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టైన 84 ఏళ్ల స్టాన్ స్వామి బెయిల్ కోసం పోరాడుతూనే అనారోగ్యంతో గుండెపోటుకు గురై తాజాగా చనిపోయారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో సెక్షన్ 43 (5)ను రద్దు చేయాలంటూ బోంబే హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ కూడా పెండింగ్ లోనే ఉంది. ఎల్గార్ పరిషద్ లో స్టాన్ స్వామితో పాటు మిగతా నిందితులు ఇచ్చిన రెచ్చగొట్టే ఉపన్యాసాలతో భీమా కొరెగావ్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని కేంద్రం వీరిపై తీవ్రమైన కేసులు మోపింది. వీటిపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications