వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో ఎన్‌కౌంటర్‌ .. లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ హతం !!

|
Google Oneindia TeluguNews

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు వైమానిక స్థావరంపై డ్రోన్లతో దాడులకు పాల్పడి, మిలటరీ స్టేషన్ దగ్గర డ్రోన్ల సహాయంతో దాడులు చేయాలని ప్రయత్నించిన క్రమంలో ఈ ఘటనతో అలర్ట్ అయిన ఆర్మీ లష్కరే తోయిబాకు చెందిన ప్రధాన కమాండర్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూకాశ్మీర్లోని పరింపోరా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కరే తోయిబా కమాండర్ నదీమ్ అబ్రార్ హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.

జమ్మూలో మరోమారు డ్రోన్ల కలకలం.. మిలిటరీ స్టేషన్ దగ్గర మరో రెండు డ్రోన్లు, ఉగ్ర కుట్ర తిప్పికొట్టిన ఆర్మీ !!జమ్మూలో మరోమారు డ్రోన్ల కలకలం.. మిలిటరీ స్టేషన్ దగ్గర మరో రెండు డ్రోన్లు, ఉగ్ర కుట్ర తిప్పికొట్టిన ఆర్మీ !!

పాకిస్తాన్ జాతీయుడు, లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాది నదీమ్ అబ్రార్ ను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత, నగరంలోని పరింపొరా ప్రాంతంలో ఆయుధాలు దాచిన ఒక ఇంటి గురించి చెప్పగా, అక్కడకు తీసుకువెళ్ళిన క్రమంలో, అక్కడ దాగి ఉన్న మరో ఉగ్రవాది దాడులకు తెగబడ్డారు అని ఈ క్రమంలో పోలీసులకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు దాడులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని పేర్కొన్నారు. వారిలో లష్కరే తోయిబా ప్రధాన కమాండర్ నదీమ్ అబ్రార్ కూడా ఉన్నట్టు వెల్లడించారు.

Encounter in Jammu .. Lashkar-e-Taiba top commander Nadeem Abrar killed !!

ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం అనేక హత్యలకు పాల్పడిన అబ్రార్ ముసుగు ధరించి సోమవారం పరింపొరాలో వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు పోలీసులపై హ్యాండ్ గ్రనైడ్ విసిరేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో తనను అరెస్ట్ చేసిన సిఆర్పిఎఫ్ బలగాలు అతనిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ గా గుర్తించారని వెల్లడించారు. అబ్రార్ వద్ద నుండి పిస్టల్ మరియు కొన్ని హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

మాలూరా ప్రాంతంలో తన ఎకె -47 రైఫిల్‌ను ఉంచిన ప్రదేశాన్ని నదీమ్ వెల్లడించడంతో అక్కడి నుంచి, నిందితుడి ఇంటిని చుట్టుముట్టిన తరువాత ఆయుధాన్ని (ఎకె 47 రైఫిల్) రికవరీ చేయడానికి అబ్రార్‌ను ఇంటికి తీసుకెళ్లారు. అతని సహచరుడు, పాకిస్థాన్ ఉగ్రవాది మరొకరు అక్కడే దాగి ఉండి పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారని వెల్లడించారు. లోపల ఉన్న మరో పాకిస్థాన్ ఉగ్రవాదితో పాటుగా, నదీమ్ కూడా ఎన్కౌంటర్లో హతమయ్యారు అని తెలిపారు . సంఘటనా స్థలం నుండి రెండు ఎకె -47 రైఫిల్స్ మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

English summary
Security forces gunned down lashkar -e -taiba top terrorist. A day after his arrest, top Lashkar-e-Taiba (LeT) terrorist Nadeem Abrar and a Pakistani national were killed in an encounter in Parimpora area of the city, police said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X