షాకింగ్: భారత్ ఓడిందని, ఆత్మహత్య చేసుకున్న యువతి!
ముంబై: గ్వాలియర్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి నేపథ్యంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్వాలియర్‌కు చెందిన ఆ అమ్మాయి సెమీ ఫైనల్లో భారత్ ఓడిన విషయం తెలియగానే ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం మేరకు.. దుపట్టాతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెస్టిండీస్‌తో ఓటమి నేపథ్యంలో భారత్ ఫైనల్‌కు వెళ్లలేదని, భారత్ కప్ గెలవలేదని భావించి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మృతి చెందిన యువతి బిటెక్ చదువుతోంది. యువతి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. అయితే, ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె భారత్ గెలుపు కోసం ప్రార్థించిందని చెబుతున్నారు.

యువతి పేరు సురుభి. ఆమె గ్వాలియర్‌లోని ఓ కళాశాలలో చదువుతోంది. ఆమె తన కుటుంబంతో కలిసి మ్యాచ్ చూసింది.
పోలీసులు మాట్లాడుతూ... మ్యాచ్ గెలిచేందుకు ఆమె పూజలు చేసిందని కుటుంబ సభ్యులు చెప్పారని, ప్రసాదం కూడా పంచినట్లు చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఆమె మృతదేహం గదిలో ఉంది. ఈ మృతి పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్రికెట్లో ఓడినందుకే ఆత్మహత్య చేసుకుందా లేక మరేదైనా కారణం ఉందా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications