వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ కంటే ఐటం గర్ల్ రాఖీసావంత్ బెట్టర్: ఉద్దవ్‌థాకరే

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కంటే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చాలా బెట్టర్ అని శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్దవ్ థాకరే శుక్రవారం మండిపడ్డారు. శివసేన పార్టీకి చెందిన పత్రిక సామ్నాలో ఉద్దవ్ తనదైన శైలిలో కేజ్రీవాల్ పైన వ్యాఖ్యలు చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ కంటే బాలీవుడ్ ఐటమ్ గర్ల్ బాగా పాలించే వారన్నారు. అదే సమయంలో కేజ్రీవాల్‌ను పిచ్చి ముఖ్యమంత్రిగా వ్యాఖ్యానించిన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను వెనుకేసుకొచ్చారు.

Arvind Kejriwal

ఢిల్లీ పోలీసుల తీరును నిరసిస్తూ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం, మంగళవారం నడి రోడ్డు పైన రెండు రోజుల పాటు ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్దవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా సమయంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పైన కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఉద్దవ్ తప్పు పట్టారు. కేజ్రీవాల్‌ను సర్కస్‌లో రింగ్ మాస్టర్‌గా పేర్కొన్నారు.

కాగా, ఎఎపికి గట్టి మద్దతుదారు అయిన ప్రముఖ రచయిత చేతన్ భగత్ కేజ్రీవాల్ ధర్నా పైన రెండు రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఎఎపిని ఐటం గర్ల్‌గా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్ నడి రోడ్డు పైన ధర్నాకు దిగడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ స్పందించారు. కేజ్రీవాల్, ఆయన సహచరులు రెండు రోజుల పాటు చేసిన ధర్నాను చూసి తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. వారి ధర్నాతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయిందన్నారు. వ్యాపారంపై ప్రభావం చూపిందన్నారు. లోకసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు, ఇప్పటికిప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నారని, అదేలా అంటే బాలీవుడ్లో ఒక నటి ఏమీ చేయలేని స్థితిలో ఐటమ్ గర్ల్‌గా మారిపోతుందని, అలానే రాజకీయాలల్లో ఎఎపి కూడా అలా మారిపోయిందన్నారు.

English summary
Intensifying attack on Arvind Kejriwal, now Shiv Sena 
 
 chief Uddhav Thackeray claimed that Rakhi Sawant is 
 
 better than Delhi Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X