రంజిత్ సిన్హాకు చుక్కెదురు: తప్పేనని సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రంజిత్ సిన్హా అధికార దుర్వినియోగంపై విచారణకు సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ చీఫ్‌గా ఉన్నప్పుడు బొగ్గు, 2జీ కుంభకోణం నిందితులను తన నివాసంలో కలిశారని రంజిత్‌పై ఆరోపణలు ఉన్నాయి.
సీబీఐ చీఫ్ హోదాలో నిందితులను కలవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి)ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు జరుగుతుండగా నిందితులను రంజిత్ సిన్హా కలవడం తప్పేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రంజిత్ సిన్హాపై విచారణ ఎలా జరగాలనే విషయాన్ని నిర్ణయించడానికి సివిసి సహకరించాలని, దీనికి సంబంధించి జూలై ఆరో తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

రంజిత్ సిన్హాపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆ ఆదేశాలిచ్చింది.
సిన్హా ఇంటి వద్ద ఉన్న అతిథుల డైరీని చూస్తే బొగ్గు కుంభకోణం విషయంలో పలువురు నిందితులు ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోందని, అంటే వాళ్లను రక్షించేందుకు ఆయన ప్రయత్నించినట్లేనని భావించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిట్‌తో దర్యాప్తు చేయించాలనే పిటిషనర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications