వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి ఆస్తి ఎంత పెరిగిందో తెలిస్తే అవాక్కైపోతారు..

|
Google Oneindia TeluguNews

రాజకీయ నాయకులు.. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ హవా ఎలా ఉంటుందో మనకు తెలియనికాదు. అక్రమ సంపాదన ఒక రేంజ్ లో ఉన్నా.. అధికారిక లెక్కలదగ్గరికొచ్చేసరికి నంబర్లు తారుమారైపోతాయి. అందరి విషయంలో ఇలా జరుగుతుందేమోకానీ నిజాయితీపరుడిగా పేరుపొందిన నితీశ్ కుమార్ విషయంలో మాత్రం మన అభిప్రాయాన్ని మార్చుకోవాలేమో.

ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌

ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ బుధవారం తన ఆస్తి వివరాల్ని ప్రజలకు వెల్లడించారు. కిందటేడాదితో పోల్చుకుంటే ఇప్పటికి ఆయన ఆస్తి ఇంతైనా వృద్ధి చెందలేదట. పెరిగింది ఏమైనా ఉందాంటే.. పాడి సంపద మాత్రం చక్కగా అభివృద్ధి చెందిందట. సీఎం ఇంట్లోని పశువుల కొట్టంలో కొత్తగా రెండు ఆవులు, ఒక లేగ దూడ పుట్టడం మినహా కొత్తగా ఆస్తులేవీ పెరగలేదట.

చెప్పిన లెక్కన ప్రకారం

చెప్పిన లెక్కన ప్రకారం

సార్ చెప్పిన లెక్కన ప్రకారం.. 2018లో ఆయనకు 8 ఆవులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 10కి పెరిగింది. గతంలోని 6 లేగ దూడలకు మరో బుల్లి లేగ తోడైంది. సీఎంతోపాటు మంత్రులందరూ తమ ఆదాయ వివరాల్ని విధిగా వెల్లడించే విధానానికి నితీశ్ 2010లో శ్రీకారం చుట్టారు. 2019 ఏడాదికి గానూ నివేదిక ప్రకారం.. పోయినేడాదది చివర్లో సీఎంగారి దగ్గర రూ.42 వేల నగదు ఉండగా.. ఇప్పుడది రూ.38,039 రూపాయలకు తగ్గిపోయింది.

మంత్రుల విషయానికొస్తే..

మంత్రుల విషయానికొస్తే..

సీఎ నితీశ్ పేరిట చరాస్తులు రూ.16 వేలు, స్థిరాస్తులు రూ.40 లక్షలు ఉండగా, ఆయన కొడుకు పేరిట రూ.1.39 కోట్లు చరాస్తులు, రూ.1.48 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. సీఎం ఆస్తి పెరగకున్నా.. మంత్రుల సంపాదన మాత్రం భారీగానే పెరిగినట్లు లెక్కల్లో తేలింది. రూ.9 కోట్ల ఆస్తులతో సురేష్‌ శర్మ ధనవంతుడిగా నిలిచారు. డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ పేరుమీద రూ.1.26 కోట్లు, ఆయన భార్యకు రూ.1.65 కోట్ల ఆస్తి ఉన్నట్లు వెల్లడైంది.

English summary
The sole growth in Nitish Kumar's property took place in his cowshed - from eight cows and six calves last year, its population increased to 10 cows and seven calves
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X