ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమవుతోందా ? లీడ్ లో సీఎంలు-ఐదు రాష్ట్రాల్లో తాజా ట్రెండ్స్..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఇందులో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, హిమంత బిశ్వ శర్మ, పినరయి విజయన్, ఎన్ రంగస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఎగ్జిట్ పోల్స్ (Exit Polls 2026 ) ఫలితాలకు దగ్గరగానే ఇవాళ వెలువడుతున్న ఫలితాలు కనిపిస్తున్నాయి. తాజా ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ తమిళనాడులో డీఎంకే కూటమి, పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ లేదా హంగ్, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి, అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్ కూటమి గెలుస్తాయని అంచనా వేశాయి. ఇందులో ఇవాళ ఫలితాల ఆరంభ ట్రెండ్స్ గమనిస్తే తమిళనాడులో డీఎంకే కూటమి ఆధిక్యం కనిపిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ ఫలితాలే కనిపిస్తున్నాయి. పుదుద్చేరిలో ఎన్డీయే, అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్ ఆధిక్యం కొనసాగిస్తున్నాయి.

Exit Polls Nail It Early Trends Mirror Predictions in Five Assembly Elections

ఆరంభ ట్రెండ్స్ తర్వాత క్రమంగా ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం బెంగాల్ తో పాటు తమిళనాడులోనూ ఆధిక్యాల్లో హోరాహోరీ కొనసాగుతోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరి మధ్యా కేవలం 5-10 సీట్ల వ్యత్యాసం మాత్రమే కనిపిస్తోంది. అలాగే తమిళనాడులోనూ అనూహ్యంగా డీఎంకేకు అన్నాడీఎంకే, విజయ్ పార్టీ టీవీకే నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే డీఎంకే కూటమి, తృణమూల్ ఆధిక్యాలు కొనసాగిస్తున్నాయి. మిగిలిన కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మాత్రం ఊహించిన ఫలితాలే వచ్చేలా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+