Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డీఎస్పీని కానిస్టేబుల్‌గా డిమోట్ చేశారు: ఎందుకంటే?

లక్నో: డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదా నుంచి కానిస్తేబుల్ స్థాయికి డిమోషన్ అయ్యారు. ఇందుకు అతడు చేసిన అనైతిక పనులే కారణం. కింది స్థాయి మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అంతకుముందు కూడా అతనిపై పలు నేరాభియోగాలు ఉండటంతో ఉన్నతాధికారులు అతడ్ని డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కార్పూర్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌కు చెందిన కృపా శంకర్‌ కనౌజియా కానిస్టేబుల్‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ డీఎస్పీ అయ్యారు. కింది స్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన కనౌజియా బుద్ధి డీఎస్పీగా మారిన తర్వాత తప్పుదారి పట్టింది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో కనౌజియా వివాహేతర సంబంధం పెట్టుకుని మూడేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు.

extramarital affair A DSP demoted as constable in Uttar Pradesh

కనౌజియా, మహిళా కానిస్టేబుల్ ఇద్దరూ 2021లో కాన్పుర్‌లోని ఒక హోటల్‌కు వెళ్లారు. అదే సమయంలో కనౌజియా భార్య ఫోన్‌ చేయగా, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కృపా శంకర్ ఆచూకీ తెలవకపోవడం వల్ల ఆందోళనకు గురైన అతని భార్య.. అనుమానంతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ విభాగం కనౌజియా నిఘా పెంచింది. ఆ సమయంలో ఉన్నావ్‌ సర్కిల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కృపా శంకర్​.. వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నాడు.

ఇంటికి బదులుగా మహిళ కానిస్టేబుల్‌‌​తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే నిఘా పెంచిన పోలీసులు, కనౌజియా కాన్పుర్‌లోని ఓ హోట్‌ల్‌లో మహిళా కానిస్టేబుల్‌తో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకోగా హోటల్లో కృపా శంకర్ కనౌజియా, మహిళా కానిస్టేబుల్‌తో కలిసి రెడ్​ హ్యాండెడ్‌గా కనిపించారు. ఈ ఘటనతో 2021లో డీజీపీ కనౌజియాను సస్పెండ్‌ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

మరోవైపు, మహిళా కానిస్టేబుల్‌ను కూడా సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం ప్రస్తుతం డీఎస్పీ కనౌజియాను కానిస్టేబుల్‌గా డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నావ్‌లోని బిఘపూర్‌లో డిఎస్పీగా ఉన్న కనౌజియా ప్రస్తుతం కానిస్టేబుల్‌గా మారారు. ఇప్పుడు 26 బెటాలియన్ కార్ప్స్‌లో శంకర్‌​కు కానిస్టేబుల్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. డీఎస్పీ హోదా నుంచి మళ్లీ కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయిన కృపా శంకర్ కనౌజియా వార్త చర్చనీయాంశంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+