అందరి కళ్లు ఆ 20 మంది ఎమ్మెల్యేల పైనే: యెడ్డీకి షాకిస్తారా, సొంత పార్టీని కాదంటారా?

బెంగళూరు: యడ్యూరప్ప ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో అందరి కళ్లు ఆయన బలం ఎలా నిరూపించుకుంటారనే అంశంపై చర్చ సాగుతోంది. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలలోని కొందరు ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తారనియడ్యూరప్ప చెబుతున్నారు. మరోవైపు, కుమారస్వామిని సీఎం చేయడంపై లింగాయత్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదే బీజేపీ బలంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల నుంచి గెలిచిన ఇరవై మంది లింగాయత్ ఎమ్మెల్యేలపై అందరి దృష్టి పడింది. యెడ్డీ లింగాయత్ కాబట్టి సీఎం ఆయన ఉన్న నేపథ్యంలో వారు మద్దతిస్తారా అనే చర్చ సాగుతోంది.

 All eyes on 20 Lingayat MLAs of Congress-JD(S) ahead of crucialfloor test

కుమారస్వామికి తాము మద్దతిచ్చి, తమ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత అయిన యడ్యూరప్పను సీఎంగా కావడం అడ్డుకుంటే తమ నియోజకవర్గాల్లో నిరసనలు, ఆ వర్గం ప్రజల ఆగ్రహం ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించి జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంత నిర్ణయంతో ఓటు వేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ప్రత్యేక మతం పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన రాజకీయాలపై ఎక్కువ మంది లింగాయత్‌లు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లోను అది కనిపించింది. ఈ నేపథ్యంలో యెడ్డీని వేనుకేసుకు రావొచ్చని అంటున్నారు.2019 లోకసభ ఎన్నికల్లోను ప్రభావం పడుతుందని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి 18 మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+