instagram bug: ప్రమాదాన్ని గుర్తించిన 21ఏళ్ల హ్యాకర్ మయూర్ -వెంటనే రూ. 22లక్షలిచ్చిన Facebook
టెక్ జమానా ముందుకు పొతున్నకొద్దీ సైబర్ నేరారాలకు అంతు లేకుండా పోతున్నది. ప్రధానంగా సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటూ వేల మంది కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తోన్న ఉదంతాలు ఇటీవల పెరిగాయి. సైబర్ నేరాలను నివారించడానికి టెక్ సంస్థలు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అందులోని లోపాలను ఆసరగా చేసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాల అదుపునకు సంస్థలతోపాటు ప్రైవేటు వ్యక్తులు, హ్యాకర్లు, ఐటీ డెవలపర్లు సైతం కీలక ప్రయత్నాలు చేస్తుండం తెలిసిందే. అలా ప్రఖ్యాత ఇన్‌స్టాగ్రామ్ లో అత్యంత ప్రమాదరక బగ్ ను కనిపెట్టి భారీ మొత్తంలో పారితోషికాన్ని కొట్టేశాడో యువకుడు..
Recommended Video

ఫాలో కాకుండానే డేటా చోరీ..
సోషల్ మీడియాలో యూజర్ల సెక్యూరిటీపై అనేక అనుమానాలు, రోజుకో రకం ఉదంతాలు వెలుగులోకి రావడం చూస్తున్నదే. ప్రొఫైల్ లాక్ చేసుకునే సదుపాయాన్ని టెక్ కంపెనీలు కల్పిస్తున్నప్పటికీ, ఆయా యాప్స్ లోని చిన్న చిన్న బగ్స్ సైబర్ నేరగాళ్ల పాలిట వరంలా మారుతున్నాయి. అలాంటి ఓ బగ్‌నే ఇన్‌స్టాగ్రామ్‌లో కనుగొన్నాడు మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల యువకుడు మయూర్ ఫర్తాడే. అతను కనిపెట్టిన బగ్ సాధారణమైనదేమీకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు ఖాతాలను ఫాలో కాకుండానే యూజర్ల ఫొటోలు, వివరాలు దొంగిలించి, బ్లాక్ మెయిల్ చేయడం, వేధింపులకు పాల్పడడం వంటి నేరాలకు వీలు కల్పించే అవకాశమున్న బగ్ అది. దాని వల్ల సైబర్ నేరస్తులకు ఎలాంటి మేలు జరుగుతుందో గుర్తించిన మయూర్.. ఆ విషయాన్ని రుజువులతో సహా ఇన్‌స్టా మాతృ సంస్థ అయిన ఫేస్‌బుక్ కు తెలియజేశాడు.

ప్రమాదాన్ని గుర్తించిన మయూర్
సోలాపూర్‌కు చెందిన మయూర్ ఫర్తడే కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇన్‌స్టాలో సైబర్ నేరగాళ్లు ఎలా అవతలి వ్యక్తుల పోస్టులను చూడగలరో పేర్కొన్నాడు. ఈ బగ్ ద్వారా ప్రైవేట్ ఇన్‌స్టా ఖాతాల ఫొటోలు, ఆర్కివ్డ్ పోస్టులు, స్టోరీలు, రీల్స్ తదితర వివరాలను పొందేందుకు అవకాశం ఉందని గుర్తించాడు. వ్యక్తుల పోస్టుకు సంబంధించిన మీడియా ఐడీ ద్వారా ఈ వివరాలను పొందొచ్చని కనుగొన్నాడు. మీడియా ఐడీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌కు చెందిన డెవలపర్ లైబ్రరీలోని గ్రాఫ్‌క్యూఎల్ అనే టూల్‌ను ఉపయోగించి బ్రూట్ ఫోర్స్‌డ్ మీడియా ఐడీని ఎంటర్ చేయడం ద్వారా సదరు పోస్ట్ తాలూకా లింక్, పోస్ట్ వివరాలు పొందొచ్చన్న విషయాన్ని గుర్తించాడు.

బగ్ బౌంటీకి రూ.22 లక్షల రివార్డు..
ప్రమాదకర బగ్ ను కనిపెట్టిన విషయాన్ని మయూర్ గత నెలలో ఫేస్‌బుక్ దృష్టికి తీసుకెళ్లగా, ఆ సంస్థ ఇంజనీర్లు పరిశీలించి, మయూర్ చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నారు. ఆ వెంటనే మయూర్ ను అభినందిస్తూ ఫేస్‌బుక్ ఒక సందేశాన్ని పంపింది. ప్రమాదకరమైన బగ్‌ను కనుగొన్నందుకు గానూ రూ.22 లక్షల రివార్డును కూడా అందజేసింది. మంగళవారం(జూన్ 15న) ఆ డబ్బులు మయూర్ ఖాతాలో పడ్డాయి. భవిష్యత్‌లోనూ ఇలాంటి లోపాలుంటే గుర్తించి పంపించాలని ఫేస్ బుక్ కోరగా, బగ్ బౌంటీ(బగ్‌ల వేట)ని ఇకపైనా కొనసాగిస్తానని, దాన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగంగా భావిస్తానని, సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాలన్నదే తన లక్ష్యమని మయూర్ బదులిచ్చాడు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications