Girl: ఫేస్ బుక్ రిక్వెస్ట్, ఫ్రెండ్ గా ఓకే చెయ్యలేదని అమ్మాయి హత్య, తల్లిని కూడా వదల్లేదు, వన్ సైడ్ లవ్ !
లక్నో/ముజఫర్ నగర్: ఓకే ప్రాంతంలో నివాసం ఉంటున్న అబ్బాయికి, మైనర్ అమ్మాయికి పరిచయం ఉంది. అమ్మాయితో ఎక్కువగా మాట్లాడుతున్న యువకుడు ఆమెను ప్రేమించాడు. అయితే తక్కువ వయసు ఉన్న ఆ అమ్మాయి మాత్రం అతనితో ఎక్కువ క్లోజ్ గా ఉండటానికి అంగీకరించలేదని తెలిసింది. ఇదే సమయంలో అమ్మాయి ఫేస్ బుక్ అకౌంట్ కు ఆ యువకుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అయితే ఆ అమ్మాయి ఫేస్ బుక్ లో ఆ యువకుడు పంపించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఫేస్ బుక్ ఫ్రెండ్ గా అంగీకరించిన అమ్మాయి మీద ఆ యువకుడు రగిలిపోయాడు. అమ్మాయి ఇంటికి వెళ్లిన కిరాతకుడు ఫేస్ బుక్ లో తనను ఫ్రెండ్ గా అంగీకరించలేవా, నేను అంటే నీకు ఇష్టం లేదా అంటూ రెచ్చిపోయి కత్తితో ఆమెను దారుణంగా పొడిచి చంపేశాడు. అడ్డుపడిన అమ్మాయి తల్లిని కత్తితో పొడిచేశాడు.

వన్ సైడ్ లవ్
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో రవి అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఓకే ప్రాంతంలో నివాసం ఉంటున్న రవికి, 16 ఏళ్ల వయసు ఉన్న మైనర్ అమ్మాయికి పరిచయం ఉంది. అమ్మాయితో ఎక్కువగా మాట్లాడుతున్న రవి ఆమెను ప్రేమించాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని రవి చాలాసార్లు ఆ అమ్మాయికి చెప్పినా ఆమె పట్టించుకోలేదని తెలిసింది.

ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్
ఆ అమ్మాయి మాత్రం రవితో ఎక్కువ క్లోజ్ గా ఉండటానికి అంగీకరించలేదని తెలిసింది. ఇదే సమయంలో మూడు నెలల క్రితం ఆ అమ్మాయి ఫేస్ బుక్ అకౌంట్ కు రవి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అయితే ఆ అమ్మాయి ఫేస్ బుక్ లో రవి పంపించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండిపోయింది.
Recommended Video


ఎంత చెప్పినా మాట వినలేదు
ఫేస్ బుక్ లో తనను ఫ్రెండ్ గా అంగీకరించాలని రవి ఆ అమ్మాయికి చాలాసార్లు చెప్పాడు. ఇప్పటి వరకు అనేకసార్లు రవి ఆమె ఫేస్ బుక్ అకౌంట్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అయితే ఆమె మాత్రం రవిని ఫేస్ బుక్ ఫ్రెండ్ గా అంగీకరించలేదు. ఫేస్ బుక్ ఫ్రెండ్ గా అంగీకరించిన అమ్మాయి మీద రవి రగిలిపోయాడు.

కత్తితో పొడిచి చంపేసిన
బంధువుల పెళ్లి పత్రిక ఇవ్వడానికి రవి ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అమ్మాయి ఇంట్లోకి వెళ్లిన రవి ఫేస్ బుక్ లో తనను ఫ్రెండ్ గా అంగీకరించలేవా, నీకు వేరే ప్రియుడు కావాలా ?, నేను అంటే నీకు ఇష్టం లేదా ? అంటూ రెచ్చిపోయి కత్తితో ఆమెను దారుణంగా పొడిచి చంపేశాడు. అడ్డుపడిన అమ్మాయి తల్లిని కత్తితో పొడిచిన రవి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఫేస్ బుక్ ఫ్రెండ్ గా అంగీకరించలేదని అమ్మాయిని హత్య చెయ్యడంతో ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications