వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

mohammed zubair : సమస్య ట్వీట్ కాదు- నా మతం,పేరు, వృత్తే -ఢిల్లీ కోర్టులో జుబైర్ వాదన

|
Google Oneindia TeluguNews

2018లో చేసిన ఓ ట్వీట్ కు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ఆల్ట్ సహ వ్యవస్ధాపకుడు మొహమ్మద్ జుబైర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ కోర్టులో వాదనలు జరిగాయి. 1983లో సెన్సార్ బోర్డ్ క్లియర్ చేసిన సినిమా స్క్రీన్‌షాట్ ను 2018లో తాను ట్వీట్ చేసినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు తన లాయర్ ఇవాళ ఢిల్లీ కోర్టుకు తెలిపారు. చాలామంది అదే ట్వీట్ చేసారని, ఆ హ్యాండిల్స్, తనకూ మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా తన మతం, పేరు, వృత్తి అని ఆయన లాయర్ వృందా గ్రోవర్ వాదించారు.

మార్చి 2018 ట్వీట్‌లో జుబైర్ హృషికేశ్ ముఖర్జీ క్లాసిక్ 'కిస్సీ సే నా కెహనా'లో ఓ చిత్రాన్ని షేర్ చేశారు. ఇది హిందీలో 'హనుమాన్ హోటల్' అని చదివే హోటల్ సైన్‌బోర్డ్‌ను చూపుతుంది. అయితే పెయింట్ గుర్తులు దీనిని గతంలో 'హనీమూన్ హోటల్' అని పిలిచేవని సూచిస్తున్నాయి. జుబేర్ 2014లో బీజేపీ అధికారంలోకి రావడంపై ఈ ట్వీట్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే జుబైర్ తరపు న్యాయవాది ఆయన ఆ ఫొటోను ఎడిట్ చేశారన్న పోలీసుల వాదనను తోసిపుచ్చారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే లేదా శత్రుత్వాన్ని ప్రోత్సహించేలా ఉందన్న ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదని అన్నారు.

fact checker mohammed zubair key comments to delhi court-only difference is faith and name

పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జుబైర్ లాయర్ వృందా కోర్టుకు తెలిపారు. ఈ ట్వీట్ వల్ల 2018-2022 మధ్య ఏం జరిగిందని ఆమె ఎధురుప్రశ్నించేారు. జర్నలిస్టుగా ఉన్న జుబైర్ శక్తివంతమైన వ్యక్తుల్ని ఎదుర్కొంటున్నట్లు లాయర్ ఢిల్లీ కోర్టుకు తెలిపారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం అతను "పాపులారిటీ కోసం మాత్రమే" వాస్తవాలను తనిఖీ చేసే వ్యక్తి అని చెప్పారు. అతనిపై నమోదైన ఇతర ఎఫ్‌ఐఆర్‌లను పేర్కొంటూ పోలీసులు ఐదు రోజుల కస్టడీని కోరారు. ఒక టీవీ షోలో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా సస్పెండ్ అయిన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియోను ఆయన ఫ్లాగ్ చేసిన కొద్ది రోజుల తర్వాత, జుబైర్‌ను గత సాయంత్రం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. డ్యూటీ మేజిస్ట్రేట్ నిన్న రాత్రి పోలీసులకు ఒక రోజు కస్టడీ ఇచ్చారు.

English summary
fact checker mohammed jubair told delhi court that he was arrested because of his faith,name and profession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X