Family: కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలను సజీవదహనం చేసిన తండ్రి, కోడలు తెచ్చిన తంటా, ఆస్తిలో !

కొచ్చి: కొడుకును గారాభంగా పెంచిన తండ్రి అతను ఏమి అడిగినా కాదనకుండా తీసిచ్చి బాగా పెంచాడు. తల్లిదండ్రులు అంటే కొడుక్కి కూడా చాలా ప్రేమ, మర్యాదా, గౌరవం ఉండేది. పెళ్లి వయసు వచ్చిన కొడుక్కి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు అకున్నారు. కొడుక్కి నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించాడు. వివాహం చేసుకున్న తరువాత కొడుకులో మార్పులు వచ్చాయి. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కొడుకులో ఇంకా తేడాలు కనిపించడంతో అతని తండ్రి ఆవేదన చెందాడు. ఇదే సమయంలో తనకు ఆస్తిలో వాటా కావాలని, నేను అడిగినంత ఆస్తి ఇవ్వాలని కొడుకు డిమాండ్ చేశాడు. తన కొడుకు మంచోడే, కాని కోడలి మాటలు విని తన కొడుకు పూర్తిగా మారిపోయాడని అతని తండ్రి బంధువులు, స్నేహితుల దగ్గర విచారం వ్యక్తం చేస్తూ వచ్చాడు.

రానురాను తండ్రి కొడుకుల మద్య ఆస్తి విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇప్పటికే ఆస్తిలో కొడకుకు వాటా ఇచ్చినా కనీసం తనకు కొడుకు, కోడులు తిండి పెట్టడం లేదని, నీళ్లు కూడా ఇవ్వడం లేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. నేను చచ్చినా నీకు ఆస్తిలో వాటా ఇవ్వనని తండ్రి తేల్చి చెప్పాడు. ఇదే విషయంలో గొడవలు ముదిరిపోయాయి. చివరికి కొడుకు, కోడలు, వాళ్లు ఇద్దరు పిల్లలు నిద్రపోతున్న సమయంలో కిటీకిలో నుంచి వారు నిద్రపోతున్న రూమ్ లో పెట్రోల్ పోసిన తండ్రి నిప్పంటించడంతో నలుగురు సజీవదహనం అయ్యారు. కొడుకు ఇంటికి తండ్రి నిప్పంటించడంతో అతని ఇల్లు కూడా బూడిద కావడం కలకలం రేపింది.

 తండ్రీ, కొడుకులు

తండ్రీ, కొడుకులు

కేరళలోని ఇడుక్కి జిల్లాలోని సినీకుజి ప్రాంతంలో హమీద్ (79) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. హమీద్ కు మొహమ్మద్ ఫైజల్ అనే కుమారుడు ఉన్నాడు. కొడుకు మొహమ్మద్ ఫైజల్ ను గారాభంగా పెంచిన అతని తండ్రి హమీద్ అతను ఏమి అడిగినా కాదనకుండా తీసిచ్చి బాగా పెంచాడు. తల్లిదండ్రులు అంటే కొడుకు మొహమ్మద్ ఫైజల్ కు కూడా చాలా ప్రేమ, మర్యాదా, గౌరవం ఉండేది.

 పెళ్లి జరిగింది.... పూర్తిగా మారిపోయాడు

పెళ్లి జరిగింది.... పూర్తిగా మారిపోయాడు

పెళ్లి వయసు వచ్చిన కొడుకు మొహమ్మద్ పైజల్ కు పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులు అకున్నారు. కొడుకు మొహమ్మద్ ఫైజల్ కు నచ్చిన షీబా అనే అమ్మాయితో వివాహం జరిపించాడు. వివాహం చేసుకున్న తరువాత కొడుకులో మార్పులు వచ్చాయి. మొహమ్మద్ ఫైజల్, షీబా దంపతులకు మొహ్రా, ఆస్నా అనే ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కొడుకు మొహమ్మద్ ఫైజల్ లో ఇంకా తేడాలు కనిపించడంతో అతని తండ్రి హమీద్ ఆవేదన చెందాడు.

 ఆస్తిలో వాటా కావాలని టార్చర్

ఆస్తిలో వాటా కావాలని టార్చర్

ఇదే సమయంలో తనకు ఆస్తిలో ఇంకా ఎక్కువ వాటా కావాలని, నేను అడిగినంత ఆస్తి ఇవ్వాలని కొడుకు మొహమ్మద్ ఫైజ్ అతని తండ్రి హమీద్ ను డిమాండ్ చేశాడు. తన కొడుకు మొహమ్మద్ ఫైజల్ మంచోడే, కాని కోడలు షీబా మాటలు విని తన కొడుకు పూర్తిగా మారిపోయాడని అతని తండ్రి బంధువులు, స్నేహితుల దగ్గర విచారం వ్యక్తం చేస్తూ వచ్చాడు. రానురాను తండ్రి కొడుకుల మద్య ఆస్తి విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి.

 కొడుకు, కోడులు చేసిన పనితో విరక్తి

కొడుకు, కోడులు చేసిన పనితో విరక్తి

ఇప్పటికే ఆస్తిలో కొడకు మొహమ్మద్ ఫైజల్ కు వాటా ఇచ్చినా కనీసం తనకు కొడుకు, కోడులు షీబా తిండి పెట్టడం లేదని, నీళ్లు కూడా ఇవ్వడం లేదని తండ్రి హమీద్ ఆవేదన వ్యక్తం చేశాడు. నేను చచ్చినా నీకు నాకు ఉన్న ఆస్తిలో వాటా ఇవ్వనని మొహమ్మద్ ఫైజల్ కు అతని తండ్రి హమీద్ తేల్చి చెప్పాడు. ఇదే విషయంలో తండ్రి, కొడుకు, కోడలి మద్య గొడవలు ముదిరిపోయాయి.

 కొడుకు ఇంట్లో పెట్రోలో పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు

కొడుకు ఇంట్లో పెట్రోలో పోసి నిప్పంటించి సజీవదహనం చేశాడు

చివరికి కొడుకు మొహమ్మద్ ఫైజల్, కోడలు షీబా, వాళ్లు ఇద్దరు పిల్లలు మోహ్రా, ఆస్నా నిద్రపోతున్న సమయంలో కిటీకిలో నుంచి వారు నిద్రపోతున్న రూమ్ లో పెట్రోల్ నింపిన బాటిళ్లు విసిరేసిన హమీద్ ఇంటికి నిప్పంటించడంతో నలుగురు సజీవదహనం అయ్యారు. కొడుకు మొహమ్మద్ ఫైజ్ ఇంటికి నిప్పంటించి బయట తాళం వెయ్యడంతో అతని ఇల్లు కూడా బూడిద కావడం కలకలం రేపింది.

 పక్కాప్లాన్ తో కొడుకు ఫ్యామిలీ ఫినిష్

పక్కాప్లాన్ తో కొడుకు ఫ్యామిలీ ఫినిష్

మొహమ్మద్ ఫైజ్ కుటుంబ సభ్యులను కాపాడానికి అవకాశం లేకుండా అతని ఇంటి నీటి ట్యాంకును ముందే ఖాలీ చేయించాడని, నీటి సంపులో ఉన్న బకెట్, తాడు కూడా బయటకు తీసేశాడని, తండ్రి హమీద్ పక్కాప్లాన్ తోనే కొడుకు ఫ్యామిలీని అంతం చేశాడని కేసు విచారణ చేస్తున్న ఓ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+