ఘోరం: కూతురికి లైంగిక వేధింపులు.. కేసు పెడితే.. తండ్రినే తగలబెట్టేశారు!

తన కూతుర్ని ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన పాపానికి ఆ తండ్రిని ఏకంగా తగులబెట్టేసిన ఉదంతమిది.

భోపాల్: తన కూతుర్ని ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ కేసు పెట్టిన పాపానికి ఆ తండ్రిని ఏకంగా తగులబెట్టేసిన ఉదంతమిది.

ఈ దారుణం మధ్యప్రదేశ్‌ హట్టా పట్టణంలోని దామో ప్రాంతంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నర్మదా సాహు(44) కుమార్తెను పొరుగునే ఉంటున్న సచిన్ సాహు అనే యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు.

Father Burnt Alive In Madhya Pradesh For Protecting Daughter From Sexual Harassment

ఈ విషయం తెలుసుకున్న నర్మదా సాహు ఆగస్టు 15వ తేదీన స్థానిక పోలీసుస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చి వచ్చాడు. ఆ తరువాత నుంచి నర్మదా సాహు కటుంబానికి సచిన్ సాహు నుంచి బెదిరింపులు, వేధింపులు అధికమయ్యాయి.

కుటుంబం మొత్తాన్ని తగులబెట్టేస్తామని శనివారం హెచ్చరించిన సచిన్ సాహు ఆదివారం సాయంత్రం అన్నంతపనీ చేశాడు. నర్మదా సాహు ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన సచిన్ సాహు (19), రామ్‌కుమార్‌ సాహు(35), రాజ్‌కుమార్‌ సాహు (34) అతడిపై కిరోసిన పోసి నిప్పంటించారు.

ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన నర్మదా సాహు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. సచిన్‌ సాహు తన కుమార్తెను గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని మృతుడి భార్య ఆరోపించింది.

ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నర్మదా సాహు ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే.. తననెవరూ వేధించలేదని మృతుడి కుమార్తె పోలీసులకు తెలుపడం. మరి అది నిజమో, లేక నిందితులకు భయపడి ఆమె అబద్ధం చెబుతోందో పోలీసుల దర్యాప్తులోనే వెల్లడికావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+