మైనర్ కుమార్తెతో కన్న తండ్రి పాడు పని.. బాలికకు పుట్టిన బిడ్డను కూడా ?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఎప్పుడూ రద్దీగా కనిపించే ఓ బాత్రూమ్ మూలన ఓ చిన్న బ్యాగ్. కానీ ఆ బ్యాగ్ తెరిచి చూసిన ప్రయాణికులకు ఊహించని దృశ్యం ఎదురైంది. అంతటి జనసమూహం ఉండే ప్రాంతంలో ఏ బాంబు లేదా మరేదైనా ఉంటుందని భయపడడం సహజమే. కానీ అందులో అప్పుడే పుట్టిన ఓ పసికందు ఉంది.
ఆ చిన్నారి కథ వెనుక దాగి ఉన్న నిజాలు మాత్రం సభ్య సమాజం సైతం తలదించుకునే నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడకు చేరుకొని శిశువును వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అదే బ్యాగ్‌లో దొరికిన సిమ్‌కార్డు ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అసలు ఏం జరిగిందంటే..?
తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ జన్మనిచ్చిన వారికి అంతటి గొప్ప స్థానాన్ని ఇస్తాం. అలా ఆడబిడ్డకి ఆపద వస్తే ముందు గుర్తుకు వచ్చేది తండ్రి. అలాంటిది ఆ ఆపదే తండ్రి అయితే.. కొండంత దైర్యంగా బిడ్డకు తోడుగా ఉండాల్సిన వ్యక్తి.. జీవితాన్ని నాశనం చేశాడు. ఆ మృగాడికి కుటుంబం కూడా అండగా నిలవడంతో ఏం చేయాలని దిక్కుతోచని స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బీహార్‌కి చెందిన ఓ మైనర్ బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. మద్యానికి బానిసగా మారిన తన తండ్రి.. ఏడాదిగా తనను లైంగికంగా వేధిస్తున్నాడు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు పరువు పోతుందనే సైలెంట్ గా ఉండిపోయారు. బాలికకు చికిత్స చేయించడానికి రైలులో ఢిల్లీకి తీసుకువెళ్తున్న సమయంలో బాత్రూంకు వెళ్లిన బాలిక అక్కడే ఓ మగబిడ్డను ప్రసవించింది. వెంటనే ఆమె కుటుంబసభ్యులు ఎవరికీ అనుమానం రాకుండా ఆ బిడ్డను ఓ బ్యాగులో చుట్టి.. పట్నా-చండీగఢ్‌కు వెళ్లే మరో రైల్లోని బాత్రూమ్ చెత్తబుట్టలో పడేసి వెళ్లిపోయారు.

ప్రస్తుతం బాలికను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధీనంలోని రక్షిత కేంద్రానికి తరలించారు. చిన్నారిని పెంచుకునే స్తోమత తమకు లేదని బాధిత కుటుంబం చెప్పడంతో పసిబిడ్డను మొరాదాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications