కూతురిని చంపి శవం ముందు డ్యాన్స్ చేశాడు
కాన్పూర్: భవిష్యత్తులో మంచి జరుగుతుందనే మూఢ విశ్వాసంతో ఓ వ్యక్తి తొమ్మిదేళ్ల కూతురిని చంపి శవం ముందు డ్యాన్స్ చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలో గల జగురా గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గిర్జేశ్‌పాల్ (40) సైకిల్ రిపేరింగ్ దుకాణం నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
అతడికి ముగ్గురు పిల్లలు. శనివారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకొని గిర్జేశ్ భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. తొమ్మిదేండ్ల చిన్నకూతురు ఖుషిని గిర్జేశ్ ఆరోజు తనవద్దే ఉంచుకున్నాడు. క్షుద్రశక్తులను సంతోషపెట్టడానికి అర్ధరాత్రి ఖుషిని కత్తితో పొడిచి చంపేసి అనంతరం శవాన్ని నట్టింట్లో పెట్టుకొని ప్రదక్షిణలు చేశాడు. డ్యాన్స్‌లు కూడా చేశాడు.

ఆదివారం ఉదయం ఎప్పటిలాగే సైకిల్ రిపేరింగ్ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఇంటికి వచ్చిన భార్య కూతురు ఏదని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పైగా ఇంట్లోకి ఎవరినీ రానివ్వలేదు. ఆందోళనకు గురైన ఆమె స్థానికుల సాయంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఖుషి రక్తపుమడుగుల్లో శవమై కనిపించింది.
పోలీసులు వచ్చి గిర్జేశ్‌ను అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అయితే అతడు కొంతకాలంగా మానసిక వ్యాధితో కూడా బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications