ఈవ్ టీజింగ్ వద్దన్నందుకు తండ్రీకొడుకులను కాల్చేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళలను ఈవ్ టీజింగ్ చేయొద్దన్నందుకు ఓ తండ్రీకొడుకులను నలుగురు దుండగులు తుపాకులతో కాల్చేశారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వారా గ్రామానికి చెందిన నవాబ్(50), అతని కుమారుడు(22) పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు దుండగులు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు.

ఆ దుండగులను తండ్రీకొడుకులు వారించే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన దుండగులు నవాబ్, సందీప్‌లను తుపాకులతో కాల్చారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు.
బాధిత తండ్రీకొడుకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications