భార్య కళ్లెదుటే ఏడేళ్లుగా ముగ్గురు కూతుళ్లని అత్యాచారం చేస్తున్న తండ్రి.. ఎక్కడంటే ?

కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం సైతం తలదించుకునేలా ఉంటున్నాయి. మనుషులు మృగాళ్లుగా మారుతున్నారు అనడానికి ఈ దారుణ ఘటనే మరో ఉదాహరణ అని చెప్పాలి. కన్నకూతురిని కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రి.. కాల యముడై కాటు వేస్తే.. ఆ తల్లి సైతం ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉండి.. భర్త కర్కశత్వానికి మిన్నకుండి పోతే ఈ బిడ్డల పరిస్థితి అగమ్యగోచరం అనే చెప్పాలి. ఈ తరహా ఘటనే ముంబైలోని నల్లసోపారా వెస్ట్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 56 ఏళ్ల నిందితుడికి 25 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు కూడా పుట్టారు. పెద్ద కుమార్తెకు 21 సంవత్సరాలు.. రెండో కూతురికి 17.. మూడో అమ్మాయికి 15 సంవత్సరాలు. అయితే తండ్రికూతుళ్ల బంధాన్ని మంట గలుపుతూ.. కూతురుని మహారాణిలా చూసుకోవాల్సిన ఆ తండ్రి వారిపైనే కన్నేశాడు. కాపాడవలసిన వ్యక్తే వారి జీవితాలను నాశనం చేశాడు.

father who has been raping his three daughters from seven years in front of his wife Where is he

2018లో ముందుగా పెద్ద కుమార్తెపై కన్ను వేసిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తొలిసారి దారుణానికి ఒడిగడితుండగా.. అడ్డుకోబోయిన భార్యను విపరీతంగా కొట్టి గాయపరిచాడు. దీంతో ఆమె తలకు తీవ్రగాయమై స్పృహ తప్పి పడిపోయింది. కుమార్తెను బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇక ఆ తర్వాత నుంచి అనేక మార్లు పెద్ద బిడ్డను మానభంగం చేశాడు. అడ్డుకోబోయిన ప్రతీసారి భార్యపై తీవ్ర స్థాయిలో దాడి చేసేవడని వాపోతున్నారు.

ఇక ఆ తర్వాత రెండో కుమార్తె, మూడో కుమార్తెపై కూడా కన్నేసిన తండ్రి.. పూటకొకరిని పాడు చేశాడని చెబుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద కుమార్తె 4 సార్లు గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించాడు. రీసెంట్ గానే ఆమె మరోసారి ఆమె గర్భవతి కాగా.. విషయం తెలుసుకున్న తల్లి.. బిడ్డలను చంపి తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే కుమార్తెలను చంపే ధైర్యం లేక వారిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.

జరిగిన విషయాన్ని వారికి తెలుపగా పోలీసులను ఆశ్రయించారు. తండ్రి చేసిన అక్రమాల గురించి కూతుళ్లు బయటపెట్టడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు
ముందు నుంచే నేర స్వభావం కలిగిన వ్యక్తిగా గుర్తించారు. ముంబయి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ముఠాలో చురుకైన సభ్యుడిగా కూడా ఉన్నాడని వెల్లడించారు. 1980, 90 సంవత్సరాల్లో పలు నేరాలు ఆయనపై ఉన్నట్టు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+