Festival: వైభవంగా జాతర, రథోత్సవం, తేరు ఊరేగింపు, విద్యుత్ షాక్ తో యువకుడు బలి, ఆసుపత్రిలో 15 మంది !
బెంగళూరు/దావణగెరె: జాతర అంటే ఊరివాళ్లు, ఊర్లో నివాసం ఉంటున్న వారి బంధువులు, స్నేహితులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే జాతరకు చుట్టుపక్కల గ్రామస్తులు హాజరౌతుంటారు. ఏడాదిలో ఒక్కసారి జరిగే దుర్గమ్మ తల్లి జాతర గ్రాండ్ గా చెయ్యాలని ఊరివాళ్లు అనుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో రెండు సంవత్సరాలు జాతర సక్రమంగా చెయ్యలేదని, ఈ సంవతర్సరం జాతర బాగా చెయ్యాలని అందరూ అనుకున్నారు. ఊరి పండుగకు వేలాది మంది హాజరైనారు. దుర్గమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఊర్లోని ప్రధాన రహదారుల్లో తేరు బయలుదేరింది. ఊరివాళ్లు, వాళ్ల బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల గ్రామస్తులు తేరు ఊరేగింపులో పాల్గోన్నారు. ఆ సమయంలో తేరుకు ఏర్పాటు చేసిన ఇనుప కమ్మీలకు విద్యుత్ సరఫరా అయ్యింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలైనాయి. విద్యుత్ షాక్ తో ఒక యువకుడు చనిపోగా ఇంకో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. తీవ్రగాయాలైన 13 మందిని ఆసుపత్రికి తరలించారు.

గ్రాండ్ గా జాతర చెయ్యాలని ఏర్పాట్లు
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చెన్నగిరి తాలుకాలోని కెంగాపురాలో ప్రతి సంవత్సరం దుర్గమ్మ తల్లి జాతర చాలా గ్రాండ్ గా జరుగుతుంది. జాతర అంటే కెంగాపురం ఊరివాళ్లు, ఊర్లో నివాసం ఉంటున్న వారి బంధువులు, స్నేహితులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే దుర్గమ్మ తల్లి జాతరకు చుట్టుపక్కల గ్రామస్తులు హాజరౌతుంటారు.

సంవత్సరానికి ఒక్కసారి జరిగే జాతర
ఏడాదిలో ఒక్కసారి జరిగే దుర్గమ్మ తల్లి జాతర గ్రాండ్ గా చెయ్యాలని కెంగాపురం ఊరివాళ్లు అనుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో రెండు సంవత్సరాలు జాతర సక్రమంగా చెయ్యలేదని, ఈ సంవతర్సరం జాతర బాగా చెయ్యాలని గ్రామస్తులు, ఊరి పెద్దలు, రాజకీయ నాయకులతో పాటు అందరూ అనుకున్నారు.

పెద్ద ఎత్తున తరలివచ్చిన బంధువులు, స్నేహితులు
కెంగాపురం ఊరి పండుగకు వేలాది మంది హాజరైనారు. దుర్గమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన తరువాత కెంగాపురంలోని ప్రధాన రహదారుల్లో తేరు బయలుదేరింది. కెంగాపురంలో నివాసం ఉంటున్న అర్జున్ (20) అనే యువకుడితో పాటు అతని స్నేహితులు తేరు ఊరేగింపులో పాల్గోన్నారు.

విద్యుత్ షాక్ తో యువకుడి బలి
కెంగాపురం ఊరివాళ్లు, వాళ్ల బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల గ్రామస్తులు తేరు ఊరేగింపులో పాల్గోన్నారు. అర్జున్ కూడా హుషారుగా తేరు తాండు పట్టుకుని లాగుతున్నాడు. ఆ సమయంలో తేరుకు ఏర్పాటు చేసిన ఇనుప కమ్మీలకు విద్యుత్ సరఫరా అయ్యింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలైనాయి. విద్యుత్ షాక్ తో అర్జున్ అనే యువకుడు చనిపోగా ఇంకో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. తీవ్రగాయాలైన 13 మందిని హున్నాళిలోని ఆసుపత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications