వాట్సప్ ద్వారా వారం రోజులకి పాప ఆచూకీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తన అమ్మానాన్నలతో కలిసి వెళ్లి.. సెప్టెంబర్ 28వ తేదీన తప్పిపోయిన మూడేళ్ల పాప ఝాన్వి, ఆచూకీని తెలుసుకోవడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడింది.
చిన్నారి ఝాన్వి ఫోటోను పంపి.. ఈమె ఎక్కడైనా కనిపిస్తే ఫలానా నెంబర్‌కు ఫోన్ చేయండి అంటూ వాట్సప్‌లో లక్ష సార్లు షేర్ చేశారు. అంతేకాదు ఝాన్వి ఆచూకీ కనుగొనేందుకు ఫేస్ బుక్‌లో ఓ ప్రత్యేక పేజీని రూపొందించారు.

వారం రోజుల తర్వాత అక్టోబర్ 5వ తేదీన ఆమె ఢిల్లీలోని జనక్‌పురి ప్రాంతంలో కనిపించింది. అప్పటికే ఆమెకు గుండు చేసి, మెడలో ఆమె పేరుతో ఒక ప్లకార్డు వేలాడుతూ కనిపించింది. ఝాన్వి మేనమామ తరుణ్ గ్రోవర్ ఈ వెతుకులాట గురించి వివరించారు.
తాము మొత్తం పది మంది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లం ఉన్నామని, అంతా బృందాలుగా విడిపోయి వెతికామని అన్నారు. హోం మంత్రి దగ్గర నుంచి అందరినీ కలిశామని, పోలీసులతో ఎప్పటికప్పుడూ అందుబాటులో ఉన్నామని తెలిపారు.

ఈరోజుల్లో సోషల్ మీడియాను యువత బాగా వాడుతుండటంతో చివరకు దాన్ని ఎంచుకున్నామని అన్నారు. ఎవరికి వాళ్లు షేర్ చేయాలంటే కష్టం కాబట్టి ఫేస్ బుక్, వాట్సప్‌లకు తాము డబ్బులు చెల్లించి ప్రకటనలూ ఈ మేసేజ్ పంపామని తెలిపారు.
మరీ ఇంతలా మేము ప్రచారం చేస్తుంటే పాపకు అపాయం తలపెట్టే అవకాశం ఉందని కూడా పోలీసులు భయపడ్డారని తెలిపారు. ఐతే ఝాన్విని ఎత్తుకెళ్లిన వారు డబ్బు డిమాండ్ చేయలేదు. బహుశా పిల్లలు లేనివారు తీసుకెళ్లి గుర్తుపట్టకుండా గుండు చేశారేమోనని పోలీసులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయడంతో భయపడి పాపను వదిలేసి వెళ్లారని అదనపు కమిషనర్ త్యాగి చెప్పారు.












Click it and Unblock the Notifications