దిల్లీ సీఎంపై FIR నమోదు.. రేపే ఎన్నికలు

దిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. దిల్లీ సీఎం ఆతిశీ పై FIR నమోదు అయింది. ఆమె ఎలక్షన్ కోడ్ ను ఉల్లఘించిన కారణంగా ఆమెపై దిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. ఎన్నికల వేళ దిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆతిశీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసుకోకుండా అడ్డుపడుతున్నారన్న కారణంతో ఆమెపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

"మేము కల్కాజీ అసెంబ్లీ ఆప్ అభ్యర్థిపై FIR నమోదు చేశాం. గోవింద్ పురి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది" అని పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ఫతే సింగ్ మార్గ్ లో ఆతిశీ, ఆమెతోపాటు 50- 70 మంది ఆప్ కార్యకర్తలు,నాయకులు ఒకే దగ్గర గుమికూడి హల్ చల్ చేశారు. ఘటనాస్థలిలో 10 వాహనాలు కూడా ఉన్నాయి. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి విధులకు వీళ్లు ఆటంకం కలిగించారు. అందుకే ఆమెపై FIR నమోదు చేశామని పోలీస్ అధికారి వివరించారు.

FIR Filed Against Delhi CM Atishi Over Election Code Violation Ahead of February 5 Polls

అయితే దిల్లీ పోలీసుల చర్యపై సీఎం ఆతిశీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి, అతని కుటుంబసభ్యులు బహిరంగంగా రోడ్లపైకి వచ్చి హల్ చల్ చేశారు. మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఇక దిల్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 19 వేల హోంగార్డులు, 42వేల మంది పోలీసులు, 660 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఈ ఎన్నికల్లో పటిష్ట భద్రత నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+