వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చోర్ పీఎం, నటి రమ్యాపై కేసు, రాఫెల్ డీల్, వివాదాస్పద మోడీ ఫోటో, రాహుల్ గాంధీ!

|
Google Oneindia TeluguNews

లక్నో: భారత ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ వివాదాస్పద ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి, కామెంట్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్, ఆ పార్టీ మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన మీద ఉత్తరప్రదేశ్ లో కేసు నమోదు అయ్యింది.

ప్రధాని పదవికి నరేంద్ర మోడీ అనర్హుడు, రాజీనామా చెయ్యాలి, రాఫెల్ డీల్: ఖార్గే!ప్రధాని పదవికి నరేంద్ర మోడీ అనర్హుడు, రాజీనామా చెయ్యాలి, రాఫెల్ డీల్: ఖార్గే!

ప్రధాని నరేంద్ర మోడీ మీద రాజకీయంగా ద్వేషం పెంచుకున్న నటి రమ్యా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ పరువుకు భంగం కలిగే విధంగా నటి రమ్యా సోషల్ మీడియాలో ఫోటో పెట్టి, కామెంట్స్ చేశారని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

యూపీలో కేసు

యూపీలో కేసు

ప్రధాని నరేంద్ర మోడీ చోర్, సైలెంట్ గా ఉన్నారు అంటూ నటి రమ్యా తన సోషల్ మీడియా అకౌంట్ లో రెండు రోజుల క్రితం పోస్టు చేశారు. ఈ విషయంపై లక్నోకు చెందిన బీజేపీ కార్యకర్త, న్యాయవాది అయిన సయ్యద్ రిజ్వాన్ గోమ్మినగర్ పోలీస్ స్టేషన్ లో నటి రమ్యా మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

దేశద్రోహం చేస్తున్నారు

దేశద్రోహం చేస్తున్నారు


ఐటీ చట్టం 2008లోని సెక్షన్ 67 ప్రకారం దుర్వినియోగం చేశారని, ఐపీసీ సెక్షన్ 124 (ఎ) ప్రకారం దేశద్రోహానికి పాల్పుడుతున్నారని రమ్యా మీద న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ ఫిర్యాదు మేరకు లక్నో పోలీసులు రమ్యా మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ప్రధాని మోడీ దొంగ !

ప్రధాని మోడీ దొంగ !


రాఫెట్ డీల్ లో ప్రధాని నరేంద్ర మోడీ అనీల్ అంబానీ కంపెనీకి లబ్దిచేకూర్చడానికి ప్రయత్నించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఓ దొంగ అని రాహుల్ గాంధీ బహిరంగంగా విమర్శలు చేశారు.

రాహుల్ బాటలో రమ్యా

రాహుల్ బాటలో రమ్యా

రాహుల్ గాంధీ విమర్శలను ఆసరాగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన తన ట్వీట్టర్ ఆకౌంట్ ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ ఓ ఫోటో పోస్టు చేశారు. రమ్యా తీరుపై ఇటు బీజేపీ కార్యకర్తలు, ప్రధాని నరేంద్ర మోడీ అభిమానులు ఆమె మీద సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

రాఫెల్ రచ్చ రచ్చ

రాఫెల్ రచ్చ రచ్చ


రాఫెల్ డీల్ వివాదంపై బీజేపీ- కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రిలయన్స్ కంపెనీకి వంతపాడుతూ రాఫెల్ డీల్ ఒప్పందంలో తలదూర్చారని, ఇది దేశానికే అవమానం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Recommended Video

సిగ్గుపడాలి.. మోడీ దేశానికి నమ్మక ద్రోహం చేశారు..!

English summary
Rafale deal: FIR has been lodged against Ramya (Divya Spandana) for tweeting an offensive photograph of Prime Minister over Rafale deal controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X