మతుంగ బిగ్ బజార్‌లో ఫైర్ యాక్సిడెంట్ : తప్పిన ప్రాణనష్టం
ముంబై : ఆర్థిక రాజధాని ముంబై మతుంగలోని షాపింగ్ మాల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు బిగ్ బజార్ స్టోర్ గ్రౌండ్ ప్లోర్ లో మంటలు చెలరేగాయి. తర్వాత అవి వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

రంగంలోకి ఫైరింజన్లు
సమాచారం అందుకున్న వెంటనే 5 ఫైరింజన్లు ఘటనాస్థంలోకి చేరుకుని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్టోర్ లోపల ఎవరూ లేనట్టు తెలుస్తోంది. అంతకుముందే వారిని బయటకు తరలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. షర్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications