అరవింద్ స్వామి ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం
చెన్నై: బహు భాషా నటుడు అరవింద్ స్వామికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. చెన్నై పోలీసు అధికారుల సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
చెన్నైలోని ఆళ్వార్ పేట సీసీ రామస్వామి రోడ్డులో ఆక్స్ ఫర్డ్ పేరుతో మూడు అంతస్తుల కట్టడం ఉంది. అందులో రెండు అంతస్తుల్లో బహుబాష నటుడు అరవింద్ స్వామికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది. అరవింద్ స్వామి సాఫ్ట్ వేర్ కంపెనీలో మంగళవారం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.

విషయం గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అప్పటికే 100 కంప్యూటర్లు, ఫర్నిచర్ కాలి భూడిద అయ్యిందని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications