హోటల్‌లో అగ్నిప్రమాదం, 25 వైద్యుల తరలింపు, మంటలార్పుతున్న 12 ఫైరింజన్లు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గల ప్రముఖ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్దరాత్రి మెరైన్ లైన్స్ సమీపంలోని ధోబీ తలావ్ వద్ద గల హోటల్ ఫార్చూన్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది

Recommended Video
A Couple Executed By Firing Squad In North Korea
హోటల్‌లో ఉన్న 25 మంది రెసిడెంట్ డాక్టర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందులో ఉన్న మిగతావారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పివేయడానికి 10 నుంచి 12 ఫైరింజన్ల ఘటనాస్థలానికి చేరుకుంది. మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హోటల్‌లోని రెండు, నాలుగో అంతస్తు నుంచి మంటలు వస్తున్నట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కానీ ప్రమాదానికి గల కారణం మాత్రం తెలియరాలేదు.












Click it and Unblock the Notifications