ఢిల్లీ భారీ అగ్నిప్రమాదం: నలుగురు సజీవదహనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాదారా ప్రాంతంలోని మోహన్ పార్క్ ఏరియాలోని ఓ భవనంలో మంటలు చెలరేగి నలుగురు మృతి చెందారు.
నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో వారు అలాగే సజీవదహనహయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.
Delhi: 3 dead, 10 injured after fire broke out in a building in Mohan Park area of Shahdara (Visuals from outside the hospital) pic.twitter.com/H7L1NebFuz
— ANI (@ANI_news) November 2, 2016
భవనంలో చిక్కుకుని స్పృహకోల్పోయిన వారిని సిబ్బంది రక్షించారు. భవనంలోని చిన్న పిల్లలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications