బడ్జెట్ డే: పార్లమెంట్‌లోని రూం నెం.50లో అగ్ని ప్రమాదం
బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రోజు.. మంగళవారం నాడు రాత్రి పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రేపు (బుధవారం) కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు రోజు.. మంగళవారం నాడు రాత్రి పార్లమెంటులో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రేపు (బుధవారం) కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
మంగళవారం పార్లమెంటులోను గది నెంబర్ 50లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గదిలోని ఓ యూపీఎస్ నుంచి మంటలు వచ్చాయి. అక్కడ ఉన్న వారు వెంటనే వాటిని ఆర్పివేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ చెప్పారు.

పార్లమెంటులోని రూం నెంబర్ 50లో అగ్ని ప్రమాదం సంభవించిందని రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే అయిదుగురు సభ్యులు అక్కడకు చేరుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications