66 కిలోల బంగారం, 336 కిలోల వెండితో ప్రసిద్ధ గణనాథుడు తొలి దర్శనం
ముంబై: దేశం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. శనివారం గణేష్ చతుర్థి కావడంతో ఇప్పటికే ఆయా మండపాలకు గణనాథులు చేరుకున్నారు. గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధిగాంచిన మహారాష్ట్రలోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇక, ముంబైలో ప్రసిద్ధిగాంచిన వినాయకుడు ఈసారి భక్తులకు సరికొత్త అనుభూతినిచ్చేందుకు సిద్ధమయ్యారు. ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లోని జీఎస్బీ సేవా మండల్ గురువారం సాయంత్రం జై బోలో గణేష్ మహారాజ్‌కి అనే నినాదాలు, సంగీతం, ధోల్ దరువుల మధ్య గణేష్ విగ్రహం ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించింది. ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

దీంతో జీఎస్‌బీ సేవా మండల్ 70వ గణేశోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఇక్కడి గణనాథుడు భారతదేశపు అత్యంత ధనిక గణేష్ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. పసుపు రంగు దుస్తులు ధరించి, 66 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 336 కిలోల వెండి, విలువైన రాళ్లతో అలంకరించబడ్డారు ఇక్కడి గణనాథుడు.
కాగా, సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే గణపతి ఉత్సవం మహారాష్ట్రలో ప్రధాన వేడుక. గణేశోత్సవం పది రోజుల పాటు ఆనందకరమైన వేడుకలు, విస్తృతమైన ఆచారాలు, ఇతర ఉత్సవాలు, గొప్ప విసర్జనతో ముగుస్తుంది. ఇక్కడ గణేశ విగ్రహాలను మంత్రాలు, సంగీతాల ఎంతో వేడుకగా నీటి వనరులలో నిమజ్జనం చేస్తారు.
#WATCH | First look of Mumbai's GSB Seva Mandal Ganpati unveiled ahead of Ganesh Chaturthi. pic.twitter.com/08tsQcW085
— ANI (@ANI) September 5, 2024
ఇక, వినాయక చవితి పండుగకు సన్నాహాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముంబై నగరంలో పండుగతో మార్కెట్ సందడిగా మారింది. విగ్రహాల తయారీదారులు గణేష్‌ని పర్యావరణ అనుకూలమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు. గణేశుడి విగ్రహాలకు తుది మెరుగులు దిద్ది మండపాలకు చేరుస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు కూడా వినాయక చవితిని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. గణేష్ ఉత్సవాలంటే తెలుగు రాష్ట్రాలకు గుర్తువచ్చే ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు ఆయన దర్శనమివ్వనున్నారు.












Click it and Unblock the Notifications