ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ వంతెన మీదుగా వైష్ణోదేవి-శ్రీనగర్ తొలి వందేభారత్.. ప్రత్యేకతలివే!
శ్రీ మాత వైష్ణో దేవి కత్రా మరియు శ్రీనగర్ రైల్వే స్టేషన్ ల మధ్య నడిచే మొట్టమొదటి వందే భారత్ రైలు ట్రయల్ రన్ నేడు ఇండియన్ రైల్వే నిర్వహించింది. అత్యంత క్లిష్టతరమైన మార్గంలో నడవబోతున్న తొలి వందే భారత్ ఆ మార్గంలో ఉన్న ప్రత్యేక వాతావరణానికి తగ్గట్టుగా అనేక ఫీచర్లతో రూపొందించబడింది.
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనపై వందే భారత్ తొలి రైలు
శ్రీమాతా వైష్ణో దేవి కత్రా శ్రీనగర్ మధ్యలో భారత దేశపు మొట్టమొదటి కేబుల్ స్టేట్ రైల్వే వంతెన అయిన అంజిఖాడ్ వంతెన, అలాగే ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆయన చీనాబ్ వంతెన ఉన్నాయి. వీటి మీదుగా ఈ మొట్టమొదటి వందే భారత్ రైలు ప్రయాణం సాగించనుంది. కాశ్మీరు లోయలోని కఠినమైన శీతల వాతావరణాన్ని తట్టుకునే లాగా ఈ రైలు రూపొందించబడింది.

కాశ్మీరు లోయలో సేవలు అందించే మొట్టమొదటి రైలు
ఈ రైలు ఈ రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ఇండియన్ రైల్వే చరిత్రలో ఒక సాహసోపేతమైన సేవగా గుర్తింపు పొందుతుంది. ఈ రైలు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం ప్రవేశపెట్టిన మూడో వందే భారత రైలు అయితే కాశ్మీరు లోయలో మాత్రం సేవలు అందించే మొట్టమొదటి రైలు ఇదేకావడం విశేషం. ఇక ఈ సెమీ హైస్పీడ్ రైలు యొక్క కార్యకలాపాలను నిర్వహణను ఉత్తర రైల్వే జోన్ పర్యవేక్షిస్తుంది.
ఈ రైలు ప్రత్యేకతలు ఇవే
ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న ఈ రైలు త్వరలోనే తన సేవలను అందించనుంది. భారతదేశ వ్యాప్తంగా మొత్తం 136 వందేభారత్ రైళ్లలో ఈ రైలు ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఇది ప్రత్యేక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా రూపొందించబడింది. రైలు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా సాఫీగా పని చేయడానికి ప్రత్యేకమైన ఎయిర్ బ్రేక్ సిస్టంతో పాటు, వెచ్చనివాతావరణాన్ని కోచ్లలో కలిగించేలాగా హీటింగ్ సిస్టంను కలిగి ఉంది.
టికెట్ ధరలు ఇలా ఉండే అవకాశం
అయితే వైష్ణో దేవి కత్రా శ్రీనగర్ మార్గంలో టిక్కెట్ ధరలను ఇంకా ఖరారు చేయలేదు. ఏసీ చైర్ కార్ కు 1500 నుండి 1600 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కు 2200 నుంచి 2500 వరకు చార్జీలు ఉంటాయని అంచనా వేస్తున్నారు .ఈ రేట్లు ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులు మరియు పర్యాటకులకు రైలు ప్రయాణం చేయడానికి ఒక బెస్ట్ ఆఫర్ గా చెబుతున్నారు.
వందే భారత్ ప్రయాణ సమయం ఇలా
ఇక నివేదికల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ శ్రీమాతా వైష్ణో దేవి కత్రా నుండి ఉదయం 8:10 నిమిషాలకు బయలుదేరి 11 గంటల 20 నిమిషాలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో రైలు శ్రీనగర్ నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బయలుదేరి మూడు గంటల 55 నిమిషాలకు శ్రీమాతా వైష్ణో దేవి కత్రాకు చేరుకుంటుంది. ఏది ఏమైనా వేగవంతమైన అద్భుతమైన సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ కాశ్మీరు లోయలోని కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ వందే భారత దూసుకుపోబోతుంది.












Click it and Unblock the Notifications