దీపావళికి తొలి వందేభారత్ స్లీపర్ రైలు.. ఢిల్లీకి 12గంటల్లో.. ఈ రూట్లోనే!
దేశంలో వందే భారత రైళ్ళు సక్సెస్ రేటు సాధించడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమైంది. భారతీయ రైల్వేను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిన కేంద్రం సుఖంగా పడుకుని ప్రయాణించేలా వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. దీపావళి నాటికి ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది.
వందే భారత్ స్లీపర్ రైలు.. తొలిరైలు ఈ రూట్ లోనే
తొలిసారి ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ మీదుగా పాట్నా వరకు వందే భారత్ స్లీపర్ రైలు నడవనుంది. ఈ రైలు కేవలం 12 గంటల్లోనే ఢిల్లీ చేరుకునే సౌలభ్యాన్ని అందిస్తోంది. అత్యాధునిక వసతులతో, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన సరికొత్త ప్రయాణ అనుభూతిని ఈ వందే భారత్ స్లీపర్ రైలు అందిస్తుందని భారతీయ రైల్వే ఇప్పటికే వెల్లడించింది.

అధునాతన వసతులతో వందేభారత్ స్లీపర్
ఈ హై స్పీడ్ రైలులో చక్కగా పడుకుని అందులో ఉన్న అధునాతన వసతులను ఎంజాయ్ చేస్తూ సుఖవంతమైన ప్రయాణం చేయొచ్చని రైల్వే పేర్కొంది. వందేభారత్ స్లీపర్ రైలులో ఎల్ఈడి స్క్రీన్లు, ఆటోమేటిక్ డోర్లు, అధునాతన ఫైర్ సేఫ్టీ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, విజువల్ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే, సీసీ కెమెరాలు వంటి ఎన్నో అధునాతన సదుపాయాలు ఉన్నాయి ఇది అధిక వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు త్వరగా చేర్చడానికి ఉపయోగపడుతుంది.
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో
సాధారణ వందే భారత్ చైర్ కార్ రైళ్లకు కొనసాగింపుగా ఈ స్లీపర్ వెర్షన్ ను రూపొందించారు. ముఖ్యంగా ఇది రాత్రిపూట ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ హై స్పీడ్ స్లీపర్ కోచ్ రైలులో ప్రయాణించడం విమాన చార్జీల కంటే తక్కువ వ్యయంతో కూడుకున్నది. వందే భారత్ స్లీపర్ కోచ్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
12 గంటల్లోనే పాట్నా నుండి ఢిల్లీకి
తొలి వందే భారత్ స్లీపర్ రైలు పాట్నా నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి ఉదయం ఏడున్నర గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది . మొత్తం సమయం కేవలం 11:30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ తో పోలిస్తే ఢిల్లీకి చాలా తక్కువ సమయంతో ప్రయాణం చేస్తుంది. మొత్తంగా ఈ తొలి వందే భారత్ స్లీపర్ రైలు దీపావళికి అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇదే గనుక జరిగితే దీపావళికి రైల్వే ప్రయాణికులకు బంపర్ బహుమతి ఇచ్చినట్టే.












Click it and Unblock the Notifications