చెన్నైలో భారీ అగ్నిప్రమాదం: ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి
తమిళనాడు రాజధాని చెన్నై వడపళని ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 9మంది గాయపడ్డారు.
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై వడపళని ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 9మంది గాయపడ్డారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసిస్తున్న వారు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది.

మంటల కారణంగా వ్యాపించిన పొగ పీల్చడం వల్లనే ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మీనాక్షి(60), సెల్వి(35), సంధ్య(10), సంజయ్(3)తోపాటు మరొకరు మృతి చెందారు.
ఈ ప్రమాదం కారణంగా సెల్లార్‌లో ఉన్న 21 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంతాలు మంటలను ఆర్పేశాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.












Click it and Unblock the Notifications