టూరిజానికి పెద్ద దెబ్బే.. గోవా 'విమాన' ఛార్జీలు మోత మోగనున్నాయి..
నేవి కార్యాచరణ రీత్యా దాబోలిమ్ ఎయిర్ నుంచి ఇండియన్ నేవి విమాన రాకపోకలను తగ్గించింది. 12.30గం. నుంచి 15.30గం. మధ్యలో ప్రయాణించే విమానాలను తగ్గిస్తున్నట్లు ఇండియనే నేవి ప్రకటించింది.
న్యూఢిల్లీ: 'గోవా'.. ఇండియాలో చాలామంది టూరిస్టులకు ఫేవరెట్ స్పాట్. ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండే గోవాకు ఇకనుంచి విమాన చార్జీల మోత మోగనుంది. గోవా నుంచి గానీ, గోవాకు గానీ ప్రయాణించాలనుకునేవారికి ఏప్రిల్ నెల నుంచి ఓ ఆరు నెలల పాటు విమాన టికెట్లు మరింత భారం కానున్నాయి.
నేవి కార్యాచరణ రీత్యా దాబోలిమ్ ఎయిర్ నుంచి ఇండియన్ నేవి విమాన రాకపోకలను తగ్గించింది. 12.30గం. నుంచి 15.30గం. మధ్యలో ప్రయాణించే విమానాలను తగ్గిస్తున్నట్లు ఇండియనే నేవి ప్రకటించింది. మామూలుగా అయితే ఈ గంట సమయంలో 15విమానాలు నడవాల్సి ఉండగా.. నిబంధనల నేపథ్యంలో ఆ సంఖ్యను 5కి తగ్గించినట్లుగా ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు.

ఈ నిర్ణయంతో విమానాల సంఖ్య తగ్గిపోవడంతో పాటు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశముండటంతో టికెట్ రేట్లు పెరిగే సూచన కనిపిస్తోంది. కాగా, నేవి నిర్వహించే ట్రైనింగ్ సెషన్ తో ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని రోజుకు నాలుగు గంటలు మూసివేస్తున్నారు.
ఇలా మూసివేయడంతో విమానాలు తగ్గడం, ప్రయాణికుల వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని ట్రావెల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం టూరిజం సెక్టార్ కు భారీ దెబ్బ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications