వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తగా ఫ్లూరోనా ఫియర్: ఇజ్రాయెల్ దేశంలో ఫ్లూరోనా మొదటి కేసు నమోదు; లక్షణాలివే

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇటీవల కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుంది అని వార్తలు వచ్చిన తర్వాత, డెల్టా వేరియంట్ తో పాటుగా ఒమిక్రాన్ వేరియంట్ కూడా కలిసి డెల్మీక్రాన్ వేరియంట్ గా రూపాంతరం చెందినట్లుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ తో పాటుగా డెంగ్యూ జ్వరం కలిసి కోవిడెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్యులు వెల్లడించారు. కరోనా మహమ్మారి దెబ్బకు ఇలా కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త జబ్బులు ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్నాయి.

దడ పుట్టిస్తున్న డెల్మీక్రాన్: ఒమిక్రాన్ కొనసాగుతుండగానే షాకింగ్ న్యూస్; డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందో?దడ పుట్టిస్తున్న డెల్మీక్రాన్: ఒమిక్రాన్ కొనసాగుతుండగానే షాకింగ్ న్యూస్; డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందో?

 ఇజ్రాయెల్ దేశంలో ఫ్లూరోనా

ఇజ్రాయెల్ దేశంలో ఫ్లూరోనా

ఇక తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఫ్లూరోనా కొత్త సమస్యగా మారింది. ఇజ్రాయెల్ దేశం మొదటి 'ఫ్లూరోనా' కేసును నమోదు చేసింది. కోవిడ్ మరియు ఫ్లూ నుండి డబుల్ ఇన్ఫెక్షన్ ఫ్లూరోనాగా అక్కడి వైద్యులు పేర్కొన్నారు. "ఫ్లూ" మరియు "కరోనావైరస్" అనే పదాల మిశ్రమంగా ఫ్లూరోనా అని పేరు పెట్టారు. ఫ్లూ తో పాటు కరోనా వైరస్ కలిసి ఫ్లూరోనా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది.

 డెలివరీ అయిన మహిళకు సోకిన ఫ్లూరోనా

డెలివరీ అయిన మహిళకు సోకిన ఫ్లూరోనా

నివేదికల ప్రకారం, ఇటీవలే ప్రసవించిన ఒక మహిళకు ఫ్లూ తో పాటు కోవిడ్ సోకింది. ఆమెకు సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని పెటాచ్ టిక్వాలోని బీలిన్సన్ ఆసుపత్రిలో రెండింటికీ పాజిటివ్ పరీక్షించబడింది. ఆమె అనారోగ్యం తీవ్రమైన లక్షణాలతో లేకపోయినప్పటికీ కొత్త అనారోగ్యం కారణంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమెకు కోవిడ్-19 టీకాలు వేయబడలేదు. ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికీ కేసును పరిశీలిస్తోంది. రెండు వైరస్లు కలిపి మరింత తీవ్రమైన అనారోగ్యానికి కారణం కావచ్చో లేదో ఇంకా నిర్ధారించబడలేదు. దీనిపై పరిశోధన ప్రస్తుతం జరుగుతుంది. ఇది మరెలా రూపాంతరం చెందుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ఫ్లూతో పాటు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయితే ఫ్లూరోనా .. లక్షణాలు ఇవే

ఫ్లూతో పాటు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయితే ఫ్లూరోనా .. లక్షణాలు ఇవే

ఇతర రోగులకు కూడా కొందరికి ఫ్లూతో పాటుగా కరోనా వైరస్ సోకినట్లు ఆరోగ్య అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంకా నిర్ధారణ కాలేదు. ఫ్లూ మరియు కోవిడ్ రెండింటికీ పాజిటివ్ పరీక్షించిన చాలా మంది రోగులు ఒకే విధమైన లక్షణాలను ప్రదర్శిస్తారని గుర్తించారు. ఇక లక్షణాలు చూస్తే జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు,,జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలనొప్పి, వికారం వాంతులు, విరేచనాలు, చిన్నపిల్లల్లో దద్దుర్లు వంటి లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.

తీవ్ర ఆరోగ్య సంక్షోభంలో ప్రపంచం .. కరోనా దెబ్బకు రోజుకో కొత్త పేరుతో రోగాలు

తీవ్ర ఆరోగ్య సంక్షోభంలో ప్రపంచం .. కరోనా దెబ్బకు రోజుకో కొత్త పేరుతో రోగాలు

ఇక ఒకరి నుండి ఒకరికి స్వల్ప తేడాలతో లక్షణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకుంది అని చెప్పడానికి రోజుకో కొత్త పేరుతో బయట పడుతున్న అనారోగ్యాలు ఊతం ఇస్తున్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తూనే కరోనా తో పాటు వస్తున్న కొత్త వ్యాధులతో కూడా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కరోనా మహమ్మారితో పాటు సీజనల్ జబ్బులు కూడా కలిసి మనుషులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో తీవ్రమైన అభద్రతా భావానికి మానవ సమాజం లోనవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోయిన ప్రపంచం వైద్య రంగంలో వైజ్ఞానిక రంగంలో ఇంకా వెనుకబాటుతనంతోనే ఉన్నట్టు కనిపిస్తుంది.

English summary
Israel has recorded its first case of 'flurona'- the double infection from Covid and flu. The name is a mix of the words flu and coronavirus.woman who recently gave birth was not vaccinated tested positive for both.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X