ఆరోగ్యం బాగోలేకపోయినా..! కోర్టులో లొంగిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్
పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం కోర్టు ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది మే నుంచి లాలూ పెరోల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఆ పెరోల్ పొడిగింపు కోసం చేసుకున్న దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దీంతో లాలూ కోర్టులో లొంగిపోయారు.
'నేను కోర్టు ఆదేశాలను అనుసరిస్తాను. నాకు ఆరోగ్య బాలేదు. కానీ హైకోర్టు తీర్పు పట్ల విశ్వాసం ఉంది' అని లాలూ వ్యాఖ్యానించారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. 70ఏళ్ల లాలూ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో మూడు నెలల పాటు పెరోల్ పొడిగించాలని జార్ఖండ్ హైకోర్టును కోరారు.

కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. ఆగస్టు 30వ తేదీన తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. లాలూకు కావాల్సిన వైద్య సహాయాన్ని జైలులోనే అందించాలని కోర్టు ప్రభుత్వానికి వెల్లడించింది. విచారణ సమయంలో పెరోల్ పొడిగింపును సీబీఐ వ్యతిరేకించింది. ఇప్పటికే ఆయన మూడు నెలల పెరోల్ తీసుకున్నారని, చికిత్స కూడా చేయించుకున్నారని తెలిపింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications