
చైనాతో మళ్లీ చర్చలు -తజకిస్థాన్ వేదికగా విదేశాంగ మంత్రుల భేటీ -LAC వద్ద తోకజాడింపులు వద్దు
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం, పూర్తిస్థాయిలో సైనిక ఉప సంహరణకు అంగీకరించిన తర్వాత కూడా డ్రాగన్ తోక జాడింపులకు పాల్పడుతోన్న క్రమంలో భారత్ మరోసారి గట్టిగా హెచ్చరించింది. చాలా రోజుల తర్వాత డ్రాగన్ దేశంతో భారత్ అత్యున్నత స్థాయిలో చర్చలు జరిపింది. ఇందుకు తజకిస్థాన్ రాజధాని దుషాంబే వేదిక అయింది..
గేమ్ ఛేంజర్: huzurabadకు amit shah -ఈటలకు కేంద్రం భరోసా -డబ్బులు తీసుకొని గెలిపిద్దామన్న బండి
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారం(జులై 14)నాడు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు దుషాంబే(తజకిస్థాన్) వెళ్లిన జైశంకర్.. ఆ సమావేశానికి విడిగా, చైనా విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాలకు చెందిన కీలక అధికార గణం కూడా ఈ భేటీలో పాల్గొంది. దీనిపై..

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశంపై భారత మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖ నుంచీ ప్రకటనలు వెలువడ్డాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ), సరిహద్దు వివాదాలకు సంబంధించి చైనా ఏకపక్ష నిర్ణయాలను భారత్ ఖాతరు చేయబోదని, 2020 ఏప్రిల్ కంటే ముందున్న స్టేటస్ కోను మాత్రమే అంగీకరిస్తామని, సరిహద్దులో పూర్తి స్థాయిలో శాంతి నెలకొనాలన్నదే భారత్ అభిమతమని, ఈ విషయాలను చైనా విదేశాంగ మంత్రికి, ఆయన బృందానికి కరాకండిగా చెప్పామని మంత్రి జైశంకర్ తెలిపారు.
కాంగ్రెస్ అనూహ్య ఎత్తుగడ: లోక్సభ నేతగా రాహుల్ గాంధీ -మోదీపై 3అస్త్రాలు -రాజ్యసభ నాయకుడిగా గోయల్
భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనేలా గతంలో సైనిక చర్చల ద్వారా కుదిరిన ఒప్పందాలను రెండు దేశాలూ గౌరవించాల్సిందేనని, సరిహద్దుల్లో సామరస్యం ద్వారానే రెండు దేశాలూ అభివృద్దిపై ఫోకస్ నిలపగలవని మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఎల్ఏసీ వ్యవహారంతోపాటు ఇతర కీలక అంశాలపైనా చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ వాదనకు తలూపిన చైనా, జైశంకర్ తో భేటీపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

అన్ని రంగాల్లో పశ్చిమ దేశాల జోక్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా ప్రాంతీయంగా సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో, శాంతి భద్రతలు,సుస్థిరత లక్ష్యంగా 2001లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ఏర్పడటం, చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా, భారత్, అఫ్ఘనిస్థాన్, ఇరాన్, మంగోలియా, పాకిస్థాన్ పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే.