Viral Video: రద్దీ రైలులో ఇరుక్కుపోయిన విదేశీయుడు.. షాకింగ్ రియాక్షన్ వైరల్
భారత్ లో రైళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో రైలు ప్రయాణం ప్రతి పౌరుడికి సుపరిచితమే.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయాలని భావించే వారు ముందుగా ఎంచుకునే మార్గం రైలు ప్రయాణమే.. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సాధారణంగా పండగలు, సెలవుల సీజన్ లో రద్దీగా ఉంటాయి. వాటిల్లో కాలు కూడా పెట్టలేనంతగా ఉంటాయి. ఇలాంటి కథనాలు మనం ఎన్నో చూశాం. అయితే దిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్ కతా, బెంగళూరు లాంటి మెట్రో పాలిటన్ నగరాల్లోని మెట్రో రైళ్లలో మాత్రం నిత్యం రద్దీగానే ఉంటుంది. ఉపాధి, ఉద్యోగాలు, కాలేజీలకు వెళ్లేవారితో మెట్రో రైళ్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. అటు వీకెండ్స్ లో నగరానికి వచ్చే వారితో ఇంకాస్త రద్దీ పెరిగి రైళ్లలో కాలు కూడా పెట్టలేనంతగా పరిస్థితి ఉంటుంది. అయితే తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది.
గేబ్ అనే విదేశీయుడు ముంబైలో రద్దీగా ఉన్న లోకల్ ట్రైన్ లో జర్నీ చేశాడు. ఆయన ఇలా రద్దీగా ఉండే రైలులో ప్రయాణం చేయడం ఫస్ట్ టైమ్. అయితే రద్దీ అధికంగా ఉన్నా తన జర్నీని ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు గేబ్. తోటి ప్రయాణికులతో సరదాగా సంభాషిస్తూ రైడ్ ను ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబై లోని ఓ స్టేషన్ కు ట్రైన్ ఎక్కేందుకు గేబ్ వచ్చాడు. అప్పటికే రైలులో ఖాళీ లేదు. ఫుల్ రష్ గా ఉంది. లోపలికి వెళ్లడం కూడా కష్టంగా మారింది. కానీ గేబ్ ఎలాగోలా రైలులోకి దూరాడు.

వెంటనే గేబ్ రైలు జర్నీని ఎంజాయ్ చేయడం ప్రారంభించాడు. రద్దీ ఎక్కువగా ఉందని ఇబ్బంది పడకుండా తోటి ప్రయాణికులతో మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తూ జర్నీ సాగించాడు. తోటి ప్రయాణికులు కూడా గేబ్ పై ప్రేమను చూపించారు. ఫ్రెండ్లీగా మాట్లాడుతూ అతనికి సహకరించారు. దాంతో గేబ్ జర్నీ మరింత సులభంగా మారింది. ఇలా విదేశీయులు భారత్ లోని రైళ్లలో ప్రయాణించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఎడ్ అనే విదేశీయుడు ముంబై లోకల్ రైలులో ప్రయాణించడమే కాకుండా తోటి ప్రయాణికులతో కలిసి డ్యాన్స్ కూడా చేశాడు. ఇక ప్రస్తుతం గేబ్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications
